Asianet News TeluguAsianet News Telugu

పుల్వామా దాడి : నాలుక మడతపెట్టిన పాకిస్తాన్ మంత్రి

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తమ పనే అని అంగీకరించిన పాకిస్తాన్ మళ్లీ మాట మార్చింది. ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని పాక్ మంత్రి ఫవాద్ చౌధురి తాజాగా చెప్పుకొచ్చారు. పుల్వామా దాడి తర్వాతి పరిస్థితుల గురించే తాను ప్రస్తావించానంటూ ఫవాద్ బుకాయించారు. 

Pak Minister Who Bragged About Pulwama Backtracks, Says Misinterpreted - bsb
Author
Hyderabad, First Published Oct 30, 2020, 11:38 AM IST

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తమ పనే అని అంగీకరించిన పాకిస్తాన్ మళ్లీ మాట మార్చింది. ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని పాక్ మంత్రి ఫవాద్ చౌధురి తాజాగా చెప్పుకొచ్చారు. పుల్వామా దాడి తర్వాతి పరిస్థితుల గురించే తాను ప్రస్తావించానంటూ ఫవాద్ బుకాయించారు. 

గతేడాది జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగి 40 మందికి పైగా జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక పాక్ హస్తం ఉందని భారత్ వాదిస్తుంది. కానీ పాక్ మాత్రం తనకేం సంబంధం లేదని పదే పదే బుకాయిస్తూ వస్తోంది. అయితే గురువారం పాకిస్తాన్ పార్లమెంటులో మాట్లాడుతూ ఫవాద్ చౌధురి పుల్వామా దాడిలో తమ ప్రమేయం నిజమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

భారత భూభాగంలోకి వెళ్లి మరీ ఆ దేశంపై దాడి చేశాం. పుల్వామాదాడి.. ఇమ్రాన్ నాయకత్వంలో పాకిస్తాన్ సాధించిన ఘన విజయం. ఇందులో అందరూ భాగస్వాములే.. అని ఫవాద్ అన్నారు. అభినందన్ విడుదలకు ముందు పాక్ అగ్ర నాయకత్వం కాళ్లు వణికాయన్న విపక్ష నేత సాదిఖ్ వ్యాఖ్యలకు బదులిస్తూ ఫవాద్ ఇలా అన్నారు.

అయితే ఫవాద్ వ్యాఖ్యలపై పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగడంతో ఫవాద్ వెంటనే నాలుక్కరుచుకున్నారు. పుల్వామా ఘటన తర్వాత భారత భూభాగంలోకి వెళ్లి మరీ దాడి చేశాం అంటూ మాట మార్చారు. 

ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా స్పందించిన ఫవాద్ పుల్వామా దాడి తర్వాత భారత్ తో జరిగిన వైమానిక దాడి గురించే నేను పరోక్షంగా ప్రస్తావించాను. అమాయకులను చంపి మేం ధైర్యవంతులమని చూపించుకోవాలనుకోవట్లేదు. ఉగ్రవాదాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.. అంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. 

మరోవైపు భారత్ జాతీయ మీడియాలతో మాట్లాడిన ఫవాద్ తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్నారు. భారత్ తో యుద్ధాన్ని మేం కోరుకోవట్లేదు. అది చాలా పెద్ద విషయం. ఎక్కడా నేను పుల్వామా దాడి చేయించింది పాకిస్తానే అని చెప్పలేదు. పుల్వామా తరువాతి పరిస్థితుల గురించే మాట్లాడాను. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారనడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios