Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ మాజీ ప్రధానిపై ఉగ్రవాద కేసు.. ప్ర‌త్యేక్ష‌ ప్ర‌సారాల‌పై నిషేధం.. అరెస్టుకు రంగం సిద్దం!?

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఎదురుదెబ్బ త‌లిగింది. పోలీసులు, మహిళా న్యాయమూర్తిని హెచ్చిరించ‌డంతో ఆయ‌న‌పై ఉగ్రవాద కేసును నమోదు చేస్తుంది. ఈ నేప‌థ్యంలో త‌న ప్రసంగాలను లైవ్‌లో ప్రసారం చేయొద్ద‌ని ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ నిర్ణ‌యించింది. 
 

Pak govt prepares for deposed PM Imran Khan's arrest, blocks his live speech
Author
Hyderabad, First Published Aug 21, 2022, 11:46 PM IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆయ‌న పై ఉగ్రవాద కేసును నమోదు చేస్తుంది. త్వ‌ర‌లోనే ఆయ‌న అరెస్టు చేయ‌డానికి రంగం చేస్తున్నారట‌. మ‌రోవైపు ఆయ‌న వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో.. ఆయ‌న‌ ప్రసంగాలను ఇకపై లైవ్‌లో ప్రసారం చేయకూడదని  పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయం తీసుకుంది. 

అస‌లేం జ‌రిగిందంటే? 

తాజాగా.. ఇస్లామాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేత షెహ్ బాజ్ గిల్ ను అరెస్టు చేసి.. పోలీసులు వేధించారని, ఇస్లామాబాద్ ఇన్ స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్, మహిళా న్యాయమూర్తిపై కేసులు నమోదు చేయాలని ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  దీంతో ఇస్లామాబాద్‌లోని మర్గల్లా పోలీస్ స్టేషన్‌లో ఆయ‌న‌పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఆ తర్వాత కోపోద్రిత్తుడైన ఇమ్రాన్ ఖాన్ ఆదివారం కూడా షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం,  పాక్ సైన్యంపై తీవ్రంగా విరుచ‌క‌ప‌డ్డారు. పాక్ లో అంతర్యుద్ధం వ‌స్తుంద‌ని బెదిరించి, తదుపరి వ్యక్తులు వీధుల్లోకి వస్తే.. పాకిస్తాన్ పరిస్థితి శ్రీలంక మాదిరిగానే ఉంటుందని అన్నారు. మ‌రోవైపు  పాకిస్థాన్ ఎన్నికల సంఘం కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తమ పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంద‌ని, అలా త‌న‌పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. 

లైవ్ ప్రసంగాల నిలిపివేత‌

ఈ నేప‌థ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను ఇకపై లైవ్‌లో ప్రసారం చేయకూడదని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ  నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇమ్రాన్ ఖాన్  ప్రసంగాలను రికార్డు చేసి, ఎడిట్ చేసిన అనంతరమే ప్రసారం చేయాలని చెప్పింది. దేశంలోని అన్ని శాటిలైట్ ఛానెళ్ళు తమ ఆదేశాలను పాటించాలని,  దేశ చట్టాల ప్ర‌కారం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. 

కుట్ర జరిగింది

ఇటీవ‌ల రావల్పిండిలోని లియాఖత్ బాగ్‌లో జరిగిన బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. షాబాజ్ షరీఫ్ ప్ర‌భుత్వంపై తీవ్రంగా విరుచుక‌ప‌డ్డారు. విదేశీ నిధుల విషయంలో తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. అక్ర‌మ దిగుమతి చేసుకున్న ఈ ప్రభుత్వానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డం తాను చేసిన  ఏకైక నేరమ‌నీ అన్నారు. 

తనకు మద్దతుగా తన నివాసానికి వచ్చే వారికి ఏజెన్సీల నుంచి ఫోన్‌లు వస్తున్నాయని, వారు ఎందుకు అక్కడ ఉన్నారని ఇమ్రాన్ పేర్కొన్నాడు. మీరు తటస్థంగా ఉన్నారా? లేదా?  అని నేను అడగాలనుకుంటున్నాను. లేకపోతే ఈ దేశానికి ఇంత నష్టం ఎందుకు చేస్తున్నారు? మీరు ఈ వ్యక్తులతో (ప్రస్తుత ప్రభుత్వం) ఎందుకు నిలబడాలనుకుంటున్నారు? గత 30 ఏళ్లుగా ఈ దేశాన్ని దోచుకుంటున్న వారిని దేశం నమ్ముతోందని మీరు అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. 

నాపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌పై ఒత్తిడి

నాపై చర్యలు తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నార‌ని చెప్పారు. మే 25న పీటీఐ ర్యాలీలో పోలీసులు హింసకు పాల్పడినప్పుడు, పై నుంచి పోలీసులకు ఆదేశాలు అందాయని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.  చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తనను అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నందున పిటిఐకి వ్యతిరేకంగా తన నిర్ణయాలన్నీ ఇస్తున్నారని, అయితే అతను సమాచారం అడిగినప్పుడు, అతను  పాకిస్తానీ ఆర్మీ నుండి ఒత్తిడికి గురవుతున్నాడని సమాధానం వస్తుందని ఇమ్రాన్ అన్నారు. ఇప్పుడు షాబాజ్ గిల్ కేసులో పోలీసులు ఒత్తిడికి లోనవుతున్నారని... పాకిస్థాన్‌లో ఏం జరిగినా మీపై అభియోగాలు మోపుతున్నార‌ని ఆయన అన్నారు. 

పాక్ లోనూ శ్రీలంక తరహా ప‌రిస్థితి 

పీటీఐపై ఒత్తిడి తెస్తే శ్రీలంక తరహా పరిస్థితిని ఎదుర్కొంటుందని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. దేశంలో  పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతుంద‌ని అన్నారు. ప్ర‌స్తుత నాయ‌కుల ఆగ‌డాల‌ను  ఆప‌డానికి ఒకే ఒక మార్గం ఉందనీ,  అది స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో పారదర్శక ఎన్నికలేన‌ని ఆయన అన్నారు. త‌న కార్య‌కర్త‌ షాబాజ్ గిల్‌ను అరెస్టును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios