పాకిస్తాన్ కి చెందిన ఇద్దరు దంపతులు.. విమానంలో రెచ్చిపోయారు. చుట్టూ వందల మంది ఉన్నారనే సంగతి మర్చిపోయి.. ముద్దులతో చెలరేగిపోయారు. అయితే.. వాళ్లు చేస్తున్న పని తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. దీంతో.. ఓ పాసింజర్ సివిల్ ఏవియేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కరాచీ-ఇస్లామాబాద్ కు వెళ్లున్న ఓ విమానంలో ఓ జంట దారుణంగా ప్రవర్తించింది. విమానం ఎక్కిన దగ్గర నుంచి ఆ దంపతులు ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు. వారి వెనకాలే కూర్చున్న ఒక వ్యక్తి వారి చర్యలకు ఇబ్బంది పడి ఎయిర్‌ హోస్టస్‌ను పిలిచి చెప్పాడు. ఆమె వెళ్లి  మీ చర్యలతో చుట్టుపక్కల వాళ్లకు అభ్యంతరం ఉందని.. ఇలాంటివి చేయకూడదని వివరించింది. అయినా వారు పట్టించుకోకుండా తమ పనిలో మునిగిపోయారు. దీంతో ఎయిర్‌ హోస్టస్‌ వారికి బ్లాంకెట్‌ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయింది.

అయితే బిలాల్‌ ఫరూక్‌ ఆల్వీ అనే అడ్వకేట్‌ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ దంపతులు చేసే పనిపై ఎలాంటి చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో సీఏఏ విమాన సిబ్బందితో ఇలాంటివి మళ్లీ రిపీట్‌ కాకుండా చూసుకోవాలని మందలించారు. అయితే అప్పటికే ఈ వార్త సోషల్‌ మీడియాకు పాకడంతో వైరల్‌గా మారింది. విమానంలో కపుల్‌ చేసిన పనిపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు.