ట్యునిష్: ఉత్తరాఫ్రికాలో ట్యునీషీయా తీరంలో వలసదారులతో వస్తున్న పడవ మునిగింది. ఈ పడవలో ప్రయాణీస్తున్న 50 మంది గల్లంతయ్యారు. మరో 33 మందిని  రెస్క్యూ సిబ్బంది కాపాడారు. సురక్షితంగా బయటపడినవారంతా  బంగ్లాదేశీయులేనని అంతర్జాతీయ వలసదారుల సంస్థ తెలిపింది. లిబియాలోని జవారా రేవు నుండి బయలుదేరిన  ఈ పడవలో 90 మంది ఉన్నారని సిబ్బంది తెలిపారు. యూరప్ వెళ్లాలనుకొనే వలసదారులు లిబియా మీదుగా ప్రమాదకరమైన  ఈ మధ్యధరా సముద్ర మార్గాన్ని ఎంచుకొన్నారు. 

ట్యునీషియా ఆగ్నేయ తీరంలో స్పాక్స్ నుండి వలసదారులతో ప్రయాణీస్తున్న పడవ సోమవారం నాడు బోల్తా పడిందని  ట్యనిషీయా మంత్రిత్వశాఖ ప్రతినిధి మహమ్మద్ జెక్రీ తెలిపారు. సోమవారం నాడు జరిగిన ఘటన ట్యునీషియాలో గత రెండు నెలల్లో మునిగిపోయిన ఐదో ప్రమాదంగా అధికారులు తెలిపారు.  ట్యునీషియా అధికారిక సంస్థ సోమవారం నాడు మధ్యాహ్నం బంగ్లాదేశ్, మొరాకో  ఆఫ్రికా నుండి 113 మంది వలసదారులను నావికాదళం రక్షించింది. వలసదారులకు ఐక్యరాజ్యసమితి సంస్థకు చెందిన బృందాలు సహాయంతో పాటు ఆశ్రయం కల్పిస్తున్నాయని జెనీవాలోని ఐఓఎ: ప్రతినిధి సఫా మెహ్లీ ట్వీట్ చేశారు.