లైబీరియాలో ఘోర ప్రమాదం: ఇంధన ట్యాంకర్ పేలి 40 మంది మృతి
లైబీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలి 40 మంది మృతి చెందారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు.
మానోరోవియా: లైబీరియాలో ఇంధన ట్యాంకర్ పేలి 40 మంది మృతి చెందారు. లైబీరియాలోని టొటాటోలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 83 మందికి గాయాలయ్యాయి.బోల్తా పడిన ట్యాంకర్ నుండి పెట్రోల్ బయటకు వచ్చింది. పెట్రోల్ తీసుకొనేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ సమయంలో ట్యాంకర్ పేలింది.ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని మధ్య భాగంలోని టొటోటా పట్టణంలో మంగళవారంనాడు ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిలో మృతదేహలను సమాధిలో పూడ్చి పెట్టారు. మృతదేహలు గుర్తు పట్టని విధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మృతదేహలు కాలి బూడిదగా మారాయి. మృతులను గుర్తించడం కష్టంగా మారిందని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.
లైబిరియా వైస్ ప్రెసిడెంట్ జ్యువెల్ హోవార్డ్ టేలర్ సామూహిక అంత్యక్రియలకు హాజరయ్యారు. కొత్త సంవత్సరాన్ని ఇలా ప్రారంభిస్తామని తామూ ఊహించలేదని హోవార్డ్ టేలర్ పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం సూచించింది.