Russian Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతునే ఉంది. ఈ దాడిని నిర‌సిస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్వదేశం(ర‌ష్యా) లో నిరసనలు వ్య‌క్తమ‌వుతున్నాయి.  మోడ్ర‌న్ హిట్లర్‌గా అభివర్ణిస్తూ..భారీ ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు, ర్యాలీలు, ఆందోళనలు చేస్తున్నారు. గ‌త మూడు రోజులుగా ర‌ష్యా రాజధాని మాస్కో లో ప్ర‌ధాన కూడ‌ళ్ల‌న్నీ దాదాపు 4000 మందికి పైగా నిర‌స‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.   

Russian Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దండ‌యాత్ర‌ను కొన‌సాగిస్తుంది. నాలుగ రోజుకు ఏ మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్టు.. ర‌ష్యా దళాలు విరుచుక‌ప‌డుతున్నాయి. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ.. బాంబుల దాడులు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే పలు కీలక ప్రాంతాలను ర‌ష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఉక్రెయిన్​ రాజధాని కీవ్ సిటీని ఆక్రమించుకునేందుకు దూసుకెళ్తుంటే.. ఎదురుదాడి తీవ్రం చేసింది ఉక్రెయిన్‌. యుద్ద‌భూమిలో రష్యా బలగాలకు నిలువ‌రించ‌డానికి ఉక్రెయిన్‌ సైనికులు కూడా వీరోచితంగా పోరాడుతున్నారు. తీవ్రంగా ప్రతిఘ‌టిస్తున్నారు. సైనిక దాడులు, బాంబుల మోతల మ‌ధ్య రాజ‌ధాని కీవ్ న‌గ‌రం వ‌ణికిపోతుంది. ఏ క్షణంగా ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. 

యుద్దాన్ని త‌క్షణ‌మే నిలిపివేయాల‌ని ప్ర‌పంచ‌దేశాలు కోరుతున్నా..రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ చ‌ర్య‌ను ఐక్య రాజ్య‌స‌మితి కూడా తీవ్రంగా ఖండిస్తుంది. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా అనేక దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. రష్యా తన తప్పుడు నిర్ణయానికి తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. అయినా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త‌గ్గ‌డం లేదు. ఈ స‌మ‌యంలో భారత ప్ర‌ధానితో మాట్లాడి.. శాంతి దిశగా అడుగులు వేయాలని పుతిన్ కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఉక్రెయిన్ అండ‌గా.. పలు దేశాలు సహాయం చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ ల‌తోపాటు 28 దేశాలు వైద్య సామాగ్రి, సైనిక సాయం అందిచడానికి ముందుకు వ‌చ్చాయి.


ఈ త‌రుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా స్వదేశం(ర‌ష్యా) లో కూడా నిరసన వ్య‌క్తమ‌వుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ.. మోడ్ర‌న్ హిట్లర్‌గా అభివర్ణిస్తున్నారు. భారీ ఎత్తున నిర‌స‌న ర్యాలీలు, ఆందోళనలు చేస్తున్నారు. గ‌త మూడు రోజులుగా ర‌ష్యా రాజధాని మాస్కో లో ప్ర‌ధాన కూడ‌ళ్ల‌న్నీ నిరసనకారులతో పోటేత్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 4000 మందికి పైగా నిర‌స‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

రోజురోజుకు నిర‌స‌న‌కారులు ప్ర‌ద‌ర్శ‌న‌లు తీవ్ర కావ‌డంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా.. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆగ‌డం లేదు. రష్యాలోని 54 నగరాల్లో దాదాపు 4,.000మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దాదాపు 2000 మంది మాస్కో నుంచి అదుపులోకి తీసుకున్నారని అంత‌ర్జాతీయ మీడియా క‌థనాలు తెలుపుతున్నాయి. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు ప్ర‌ధానంగా.. సెంట్రల్ స్క్వేర్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌తో సహా అనేక ఇతర నగరాల్లో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడిని వ్య‌తిరేకిస్తూ.. మ‌న‌దేశంలో కూడా పలు ప్ర‌ధాన న‌గ‌రాల్లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి.

వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ ఎక్కడ సురక్షితం అనిపిస్తే అక్కడ తలదాచుకుంటున్నారు. ఈ హృదయ విదారక దృశ్యాలు ప్ర‌పంచ దేశాల‌ను తీవ్రంగా క‌లిచివేస్తున్నాయి. అందుకే స్వ‌దేశంలోనూ పుతిన్ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు వ్య‌క్తమ‌వుతున్నాయి. బహిరంగ లేఖలు, సందేశాలు, ఆన్‌లైన్ పిటిషన్లతో దాడులను ఆపాలని కోరుతున్నారు.