పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా... భారత ఆర్మీ.. మంగళవారం పాక్ భూభాగంపై  సర్జికల్ స్ట్రైక్స్ కి పాల్పడిన సంగతి తెలిసిందే. పాక్ కి బుద్ధి చెప్పేందుకు భారత ఆర్మీ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి మాత్రం.. సొంత దేశంలేనే విమర్శలు ఎదురయ్యాయి.

ఈ దాడులపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైనికులతో అదేవిధంగా పార్లమెంట్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. కాగా.. భారత్ సర్జికల్ స్ట్రైక్స్.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. షేమ్ షేమ్ అంటూ పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రతిపక్ష పార్టీ నేతలు స్లోగన్స్ చేయడం గమనార్హం.

భారత ఆర్మీ మిరేజ్ 2000 యుద్ధ విమానాల‌తో .. ఎల్వోసీ వ‌ద్ద ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌పై వైమానిక ద‌ళం దాడికి పాల్ప‌డింది. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌16 యుద్ధ విమానాలు అడ్డుకునేందుకు వ‌చ్చాయి. కానీ మిరేజ్ ఫ్లీట్‌ను చూసిన ఎఫ్‌16 విమానాలు వెన‌క్కి వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఈ సర్జికల్ స్ట్రైక్స్ లో 300మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.