బర్త్ డే పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి,9మందికి గాయాలు

One killed, child among 13 injured in Toronto shooting; gunman dead: Police
Highlights

తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడు మృతిచెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కెనడాలోని టొరంటో నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. స్థానిక గ్రీక్‌టౌన్‌ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌ లోపల బర్త్ డే పార్టీ జరుగుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడు మృతిచెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కెనడా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు టొరంటో పోలీసులు తెలిపారు. కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే అంతలోపే ఆ నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ ఘటనలో 9 మంది గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. అయితే ప్రస్తుతం వీరి పరిస్థితి ఎలా ఉందన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు.

loader