Omicron sub-variant: ఇప్ప‌టికే ఒమిక్రాన్ ఉప్పెన‌.. కొత్త‌గా స‌బ్ వేరియంట్ !

Omicron sub-variant: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న‌ది. మ‌రీ ముఖ్యంగా క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కార‌ణంగా చాలా దేశాల్లో క‌రోనా వైర‌స్ కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ పుట్టుకురావ‌డం పై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. 
 

Omicron sub-variant: UK reports hundreds of new cases; could spread quickly, shows data

Omicron sub-variant: 2019లో చైనాలో వెలుగుచూసిన క‌రోనా మ‌హ‌మ్మారి అతి త‌క్కువ కాలంలోనే యావ‌త్ ప్ర‌పంచాన్ని చుట్టుముట్టేసింది. ఇప్ప‌టికీ త‌న ప్ర‌భావాన్ని పెంచుకుంటూ మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. అనేక మ్యూటేష‌న్ల‌కు గురై మాన‌వాళికి మ‌నుగ‌డ‌కు స‌వాలు విసురుతోంది. ప్ర‌స్తుతం చాలా దేశాల్లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో Coronavirus రోజువారీ కేసుల్లో కొత్త రికార్డు న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి.  అన్ని దేశాల్లో క‌లిపి రోజువారీ కేసులు 30 ల‌క్ష‌లకు ద‌గ్గ‌ర‌గా న‌మోదుకావ‌డం క‌రోనా వైర‌స్ ఉధృతి కి అద్దం ప‌డుతున్న‌ది.  మ‌రీ ముఖ్యంగా ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్  అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో Coronavirus కొత్త కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఇలాంటి ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఉండ‌గా.. తాజాగా మ‌రో అంశం అందిరినీ భ‌యాందోళ‌న‌కు గురిచేక‌స్తున్న‌ది. 

అదే ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ (Omicron sub-variant). కరోనా వైర‌స్ మ్యూటేష‌న్  అయిన B.1.1529గా పిలిచే ఒమిక్రాన్ వేరియంట్‌.. గత నెల డిసెంబర్‌లో BA.1, BA.2గా విడిపోయి ఎటాక్ చేస్తూనే ఉంది. వాటికి తోడు ఇప్పుడు ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్‌ పుట్టుకొచ్చింది. రహస్య ఒమిక్రాన్‌గా పేర్కొంటున్న ఈ సబ్‌ స్ట్రెయిన్‌నూ బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ర‌కం కేసులు వంద‌ల సంఖ్య‌లో అక్క‌డి వైద్య అధికారులు గుర్తించారు. ఈ క్ర‌మంలోనే ఈ ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ ను హెల్త్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేటగిరీలో ఉంచి.. సమగ్ర పరిశోధనలు నిర్వ‌హిస్తున్న‌ద‌ని అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) ఈ నెల మొదటి పది రోజుల్లో బ్రిటన్‌లో 400 కంటే ఎక్కువ ఈ ర‌కం కేసులను గుర్తించింది. ఈ కొత్త స‌బ్ వేరియంట్ దాదాపు 40 ఇతర దేశాలలో గుర్తించారు. కొన్ని దేశాలలో ఇటీవలి కేసులలో ఎక్కువ భాగం ఇవే ఉన్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

"వైరల్ జీనోమ్‌లో మార్పుల ప్రాముఖ్యత చుట్టూ ఇంకా అనిశ్చితి ఉంది అని బ్రిట‌న్ హెల్త్ అథారిటీ నొక్కి చెప్పింది. ఇటీవలి రోజుల్లో కేసులు ముఖ్యంగా భారతదేశంతో పాటు డెమార్క్‌లో BA.2 స‌బ్ వేరియంట్ కేసులు గణనీయంగా పెరిగాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. "ఆసియాలో చాలా వరకు చలామణిలో ఉన్న ఈ ఉప-వేరియంట్ (Omicron sub-variant) డెన్మార్క్‌లోనూ వెలుగుచూడ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం" అని ఫ్రెంచ్ ఎపిడెమియాలజిస్ట్ ఆంటోయిన్ ఫ్లాహాల్ట్ అన్నారు. ఒక శతాబ్దంలో అత్యంత ఘోరమైన ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించిన క‌రోనా వైరస్, ఎలా అభివృద్ధి, పరివర్తన చెందుతున్న‌ద‌నే విష‌యంపై శాస్త్రవేత్తలు మ‌రింత లోతుగా విశ్లేషించాలని తెలిపారు. ఇప్ప‌టికీ గుర్తించిన BA.2 ఇంకా ఆందోళనక‌ర వేరియంట్ గా పేర్కొన‌బ‌డ‌న‌ప్ప‌టికీ.. దీనిపై (Omicron sub-variant) అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. 

ఇదిలావుండ‌గా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 351,754,395 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్‌-19 తో పోరాడుతూ 5,613,823 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు 279,521,945 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన దేశాల జాబితాలో అమెరికా, భార‌త్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్, యూకే, ర‌ష్యా, ట‌ర్కీ, ఇట‌లీ, స్పెయిన్‌, జ‌ర్మ‌నీ దేశాలు టాప్-10 లో ఉన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios