కరోనాను జయించిన 106 ఏళ్ల బ్రిటన్ బామ్మ

బ్రిటన్ కు చెందిన  106 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. 106 ఏళ్ల బామ్మ కరోనా  వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొంది. మూడు వారాల పాటు ఆమె ఆసుపత్రిలో చికిత్స పొంది మూడు వారాల పాటు మహమ్మారితో పోరాడి కోలుకొన్నారు. ఆమెను ఇంటికి పంపారు.
Oldest patient discharged from Birmingham hospital
లండన్: బ్రిటన్ కు చెందిన  106 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. 106 ఏళ్ల బామ్మ కరోనా  వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొంది. మూడు వారాల పాటు ఆమె ఆసుపత్రిలో చికిత్స పొంది  కోలుకొన్నారు. 

ఇంగ్లాండ్ కు చెందిన కోనీ టీచెన్ అనే 106 ఏళ్ల బామ్మ కరోనా వైరస్ బారిన పడింది. దీంతో ఆమె బర్మింగ్‌హం సిటీలో ఆసుపత్రిలో చేరింది. మూడు వారాల పాటు ఆమె చికిత్స తీసుకొంది.
also read:భారతీయులకు ఊరట: వీసాల గడువు పొడిగింపుకు అమెరికా అంగీకారం

కోనీకి కొన్ని నెలల క్రితం హిప్ ఆపరేషన్ జరిగింది. అయినప్పటికీ నెల రోజుల వ్యవధిలోనే ఆమె తిరిగి నడకను ప్రారంభించింది. అయితే ఇదే సమయంలో ఆమె కరోనా బారినపడింది.  కరోనా పై కూడ ఆమె విజయం సాధించింది. కరోనాపై విజయం సాధించి కుటుంబ సభ్యులను కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారామె.

బామ్మ ఎప్పుడూ చురుకుగా ఉంటారన్నారు.. తన పనులు తానే చేసుకొంటారని కోని మనుమరాలు అలెక్స్ జోన్స్ చెప్పారు. ఈ వయస్సులో కూడ బామ్మ తన పనులు తానే చేసుకొంటుందన్నారు.

కరోనా సోకిన వారిలో 60 ఏళ్ల వయస్సుబడిన వారు ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. కానీ, బ్రిటన్ కు చెందిన కోనీ టీచెన్ మాత్రం కోలుకొంది. 1913లో కోనీ టీచెన్ జన్మించింది. 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios