అతనో నరూరప రాక్షసుడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 11మంది మహిళలను అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతమంది మహిళలను పొట్టనపెట్టుకున్న పాపం ఊరికే పోదు కదా..ఆ పాపమే సదరు సీరియల్ కిల్లర్ కి వింత రోగంలా దాపురించింది. ఆ వింత రోగంతోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన అమెరికా లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓహైయోకి చెందిన ఆటోని సోవెల్(61) కి మహిళలను చంపి ఇంటి పరిసరాల్లో దాచిపెట్టిన కేసులో మరణ శిక్ష పడింది. అయితే.. కారాగారంలో ఉన్న సమయంలో అతనికి అంతుబట్టని వింత రోగం సోకింది. ఆ వింత రోగం కారణంగా ాఅతను ప్రాణాలు కోల్పోయాడు. ఆ వింత రోగం కరోనా మాత్రం కాదని అధికారులు స్పష్టం చేశారు.

2009 అక్టోబర్ లో తొలుత సోవెల్ ను ఓ అత్యాచారం కేసులో పోలీసులు విచారించారు. ఈ కేసు నేపథ్యంలోనే అతని ఇంట్లో సోదాలు చేయగా రెండు మహిళల మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో అనుమానంతో ఇంటి చుట్టూ కూడా గాలించగా.. దాదాపు 11మంది ని చంపినట్లు తేలింది. వారందరి అవశేషాలు అక్కడ దొరికాయి.

దీంతో.. అతనిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 11మందిని చంపిన నేరం రుజువు కావడంతో 2011లో అతనికి మరణ శిక్ష పడింది. హత్యలతోపాటు.. అత్యాచారం కేసులో కూడా సోవెల్ దోషిగా తేలడం గమనార్హం. కాగా.. జైల్లో ఉన్న సోవెల్ తనకు కింది కోర్టు విధించిన శిక్షపై పదే పదే అప్పీల్ చేస్తూ వచ్చేవాడు. తనపై నేర విచారణ నిష్పక్షపాతంగా జరగలేదంటూ పిటిషన్ వేశాడు.

దీనిపై గతేడాది మే నెలలో ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ విచారించి.. అతడు చేస్తున్న ఆరోపణలపై సరైన ఆధారాలను సమర్పించడంలో విఫలమయ్యాడని పేర్కొంది. ఆరోపణలపై ఆధారాల్లేవని కొట్టివేసింది. అలాగే.. తనకు శిక్ష నుంచి మినహాయింపు  ఇవ్వాలని దాఖలు చేయగా.. ఆ పిటిషన్ ని న్యాయస్థానం కొట్టేసింది. కాగా.. ఇటీవల అతను ఓ వింత రోగంతో ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు.