Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచానికి మొదటి సారిగా కూతురును పరిచయం చేసిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఎలా ఉందంటే ?

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మొదటి సారిగా తన కూతురును ప్రపంచానికి పరిచయం చేశాడు. బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం సందర్భంగా ఆమెను బహిరంగ ప్రదేశానికి తీసుకొచ్చాడు. అయితే ఆమె పేరు, వయస్సును మాత్రం తెలియజేయలేదు. 

North Korean President Kim Jong Un who introduced his daughter to the world for the first time.. How is it?
Author
First Published Nov 19, 2022, 9:01 AM IST

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రపంచ దేశాలన్నింటికి సుపరిచితమైన వ్యక్తే. ప్రపంచ దేశాల మాట వినకుండా తన సొంతంగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటాడు. మిస్సైల్స్ ప్రయోగిస్తూ ఎప్పుడూ వార్తాల్లో కనిపిస్తూ ఉంటారు. ఆయన దేశంలో కూడా పౌరులకు కూడా కఠిన నిబంధనలు వర్తింపజేస్తాడని, తన మాట వినని వారికి శిక్షలు విధించే నియంతగా పేరుంది. 

కిమ్ జోంగ్ ఉన్ అందరికీ తెలిసిన వ్యక్తే అయినా.. ఆయన వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి పెద్దగా తెలియవు. తన కుటుంబ వివరాలు చాలా రహస్యంగా ఉంచుతారు. తన భార్యా, పిల్లల పేర్లు, ఫొటోలు ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించరు. అయితే తాజాగా కిమ్ జోంగ్ ఉన్ తన కూతురును ప్రపంచానికి పరిచయం చేశాడు. కూతురు చేయి పట్టుకొని నిలబడిన ఫొటో బహిర్గతం చేశాడు. 

లాంగెస్ట్ ఫుడ్ డెలివరీ.. నాలుగు ఖండాలు దాటి సింగపూర్ నుంచి అంటార్కిటికాకు వెళ్లిన మహిళ (వీడియో)

అమెరికా ఎన్ని బెదిరింపులకు గురి చేసినా కూడా ఉత్తర కొరియా తాజాగా మళ్లీ కొరియా ద్వీపంలో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు జోంగ్ ఉన్ మొదటిసారిగా తన కూతురును కూడా వెంటబెట్టుకొని వచ్చారు. అందులో ఆ అమ్మాయి తెల్లటి కోటు ధరించి కనిపిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ ఆమె చేతులు పట్టుకొని ఉన్నాడు.  ఉత్తర కొరియా శుక్రవారం హ్వాసాంగ్-17 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని పరీక్షించినట్లు వార్తా సంస్థ కేసీఎన్ఏ నివేదించింది. ఈ సందర్బంగానే కూతురును బహిరంగంగా తీసుకొని వచ్చాడు. 

దీనిపై అమెరికాకు చెందిన స్టిమ్సన్ సెంటర్‌లో ఉత్తర కొరియా నాయకత్వ నిపుణుడు మైఖేల్ మాడెన్ మాట్లాడుతూ.. కిమ్ జోంగ్ ఉన్ కుమార్తెను బహిరంగ కార్యక్రమంలో చూడటం ఇదే మొదటిసారి అని అన్నారు. కిమ్ జోంగ్ రిలాక్స్‌డ్‌గా ఉన్నాడని, ఆయన దేనికి భయపడబోనని చెప్పేందుకే బహిరంగ పర్చారని తెలిపారు.  అయితే ఆమె పేరు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ జు ఏ అని అందరూ భావిస్తున్నారు. 

కదులుతున్న కారులో మోడల్ పై గ్యాంగ్ రేప్, మహిళతో సహా నలుగురి అరెస్ట్..

జు ఏ వయస్సు సుమారు 12-13 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు మరో నాలుగైదు సంవత్సరాల్లో ఆమె యూనివర్సిటీకి హాజరయ్యేందుకు లేకపోతే సైనిక సేవకు వెళ్లడానికి సిద్ధమవుతోందని మైఖేల్ మాడెన్ చెప్పారు. ‘‘తాజా పరిణామం జు ఏ ఉన్నత విద్యకు, నాయకత్వంలోకి వెళ్ళడానికి శిక్షణ పొందుతోందని సూచిస్తోంది. తరువాత ఆమె కేంద్ర నాయకురాలిగా పదవి చేపట్టవచ్చు. లేకపోతే ఆమె తన అత్త మాదిరిగా తెరవెనుక రాజకీయాలు చేయొచ్చు  ’’ అని ఆయన చెప్పారు. 

కాగా.. కిమ్‌కి ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబరులో జాతీయ సెలవుదిన వేడుకల ఫుటేజీలో ఆ పిల్లలలో ఒకరు కనిపించారని చెబుతుంటారు. అలాగే 2013లో రిటైర్డ్ అమెరికన్ బాస్కెట్‌బాల్ స్టార్ డెన్నిస్ రాడ్‌మాన్ కిమ్‌కి జూ ఏ అనే "బిడ్డ" కూతురు ఉందని చెప్పాడు. ఆ సంవత్సరం ఉత్తర కొరియా పర్యటన తర్వాత రాడ్‌మన్ ది గార్డియన్ వార్తాపత్రికతో మాట్లాడుతూ తాను కిమ్, అతడి కుటుంబ సభ్యులతో గడిపానని, బిడ్డను పట్టుకున్నానని చెప్పాడు.

షాకింగ్.. డాసనా జైల్లో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్..

కాగా.. తన అనంతరం ఉత్తరకొరియాకు ఎవరు నాయకత్వం వహిస్తారో కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ప్రకటించలేదు. అయితే ఆయన పిల్లల వయస్సు తక్కువగా ఉంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. కిమ్ వారసులు స్వీకరించేంత వయస్సు వచ్చే వరకు ఆయన సోదరి, విధేయులు కలిసి రీజెన్సీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios