Asianet News TeluguAsianet News Telugu

ప్రశాంతంగా నిద్ర పోవాలంటే.. జో బైడెన్ కు కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్...

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధ్యక్షుడికి కీలక సలహాదారుగా కూడా పనిచేస్తున్న కిమ్‌ యో జాంగ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన వెలువరించింది. 

north korean leaders sister warns US as biden envoys begin asia trip - bsb
Author
Hyderabad, First Published Mar 16, 2021, 3:16 PM IST

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధ్యక్షుడికి కీలక సలహాదారుగా కూడా పనిచేస్తున్న కిమ్‌ యో జాంగ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన వెలువరించింది. 

అయితే అగ్రరాజ్యం, ఉత్తర కొరియాలు బద్ధ శత్రువులని తెలిసిన విషయమే. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతా శత్రుత్వం ఈ రెండు దేశాలది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడైన్ గెలిచి అధ్యక్ష పదవిని చేపట్టి రెండు నెలలు గడిచాయి. వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన వెలవరించింది. 

కాగా అగ్రరాజ్యం, ఉత్తర కొరియాలు బద్ధ శత్రువులని తెలిసిన విషయమే.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఈ రెండు దేశాలది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిచి అధ్యక్ష పదవిని చేపట్టి రెండు నెలలు గడిచాయి. ఈ క్రమంలో తొలిసారిగా కిమ్ యో జాంగ్ బైడెన్ కు హెచ్చరికలు జారీ చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. 

మీరు వచ్చే నాలుగేళ్లు ప్రశాంతంగా నిద్ర పోవాలనుకుంటే మళ్లీ మొదటి నుంచి పని మొదలుపెట్టకండి. దాని వల్ల మీరు నిద్ర కోల్పోతారంటూ పేర్కొంది. అయితే ఇటీవల నార్త కొరియా మిలిటరీ పరేడ్ లో భాగంగా సబ్ మెరైన్ తో బాలిస్టిక్ మిస్సైల్ ను లాంచ్ చేసిన అనంతరం కిమ్ మాట్లాడుతూ అమెరికా తమకు ప్రధాన శత్రువు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

బైడెన్ అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కిమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా చైనాకు, అణ్వాయుధ సంపత్తి ఉన్న ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా కూటమి కట్టడం కోసం అమెరికా ఈ కీలక పర్యటనలు చేపడుతోంది. 

ఇందుకోసం అమెరికాకు చెందిన పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ మిత్ర దేశాలైన జపాన్, దక్షిణ కొరియా దేశాల పర్యటనలను సోమవారం ప్రారంభించిన నేపథ్యంలో కిమ్ యో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే వారికి ఇదే తొలి విదేశీ పర్యటన. అయితే గతవారం సౌత్ కొరియాతో కలిసి అమెరికా సంయుక్త మిలిటరీ కసరత్తులు చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఇక దీనిపై నార్త్ కొరియా స్పందిస్తూ.. తమ భూభాగంలో గన్ పౌడర్ వాసనను విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తున్న అమెరికా కొత్త పాలకవర్గానికి ఒక సూచన అంటూ ఈ హెచ్చరికను జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios