హార్ట్ ఆపరేషన్: విషమించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యం?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య స్థితి విషమంగా ఉన్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఆయన హృదయ సంబంధ సర్జరీ తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయినట్టు వార్తలు వస్తున్నాయి

North korea ruler Kim Under serious health trouble after heart surgery?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య స్థితి విషమంగా ఉన్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఆయన హృదయ సంబంధ సర్జరీ తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయినట్టు వార్తలు వస్తున్నాయి.

ఉత్తర కొరియా వార్తలు నేరుగా బయటకు రావడానికి అక్కడ వేరే ఏ దేశ రిపోర్టర్లను అనుమతించారు కాబట్టి అందరూ కూడా వేర్వేరు మాధ్యమాల నుండి తమకున్న కొన్ని సీక్రెట్ కాంటాక్ట్స్ నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరిస్తారు. 

ఏప్రిల్ 15వ తేదీన ఉత్తరకొరియా ఏర్పాటు దినోత్సవం. దాన్ని ఏర్పాటు చేసింది స్వయానా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ తాత. ఆ వేడుకను అత్యంత ఘనంగా, ఆడంబరంగా నిర్వహిస్తారు. అలాంటి ఈవెంట్ కి కిమ్ రాకపోవడంతో ఇక వెంటనే కిమ్ ఆరోగ్య పరిస్థితి పై అన్ని మీడియా సంస్థలు ఆరా తీయడం మొదలుపెట్టాయి. 

ఒక్కో మీడియా సంస్థ ఒక్కో సోర్స్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది. ముఖ్యంగా అమెరికాలోని మీడియా అమెరికా ఇంటలిజెన్స్ ఆఫీసర్ల మీద ఆధారపడి వార్తలు రాస్తే, మరికొందరు చైనాలోని కొందరు అధికారుల ద్వారా తెలుసుకుంటారు. మరికొన్ని సంస్థలు దక్షిణ కొరియాలో ఉన్న కాంటాక్ట్స్ ద్వారా తెలుసుకుంటాయి. 

ఇలా ఇన్ని మాధ్యమాల నుండి ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో క్లారిటీ కరెక్ట్ గా రావడం లేదు. ఒక్కో మీడియా సంస్థ ఒక్కో రిపోర్ట్ ని ప్రచురిస్తున్నాయి. కొందరేమో కిమ్ ఆరోగ్యం పూర్తిగా విషమించి ఆయన చికిత్స పొందుతున్నారంటే...ఎన్బీసి న్యూస్ మాత్రం ఏకంగా కిమ్ బ్రెయిన్ డెడ్ అని రిపోర్ట్స్ ప్రచురిస్తుంది. 

కొన్ని అధికారిక ఏజెన్సీల ప్రకారం మాత్రం కిమ్ గుండె కు సంబంధించిన సర్జరీ చేయించుకున్నాడని, దాని నుంచి కోలుకుంటున్నాడని తెలియవస్తుంది. ఉత్తరకొరియాలోని సీక్రెట్ సోర్స్ నుండి సమాచారాన్ని సేకరించే ఒక పత్రిక మాత్రం కిమ్ సర్జరీ తరువాత కోలుకుంటున్నాడని, అతడి ఆరోగ్యం బాగుందని తెలిపింది. 

ఇక్కడ మరొక ఆస్కతికర అంశం ఏమిటంటే.... కిమ్ తాత, కిమ్ తండ్రి ఇద్దరు కూడా గుండె సంబంధ వ్యాధితోనే మరణించారు. దీన్ని కూడా చూపెడుతూ మీడియా సంస్థలు కథనాలు రాయడం గమనార్హం.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios