గత నెలలో ఏకథాటిగా నాలుగు రోజుల పాటు వంట చేసి గిన్నిస్ రికార్డుకు ప్రయత్నించిన నైజీరియన్ హిల్డా బాసి (26) రికార్డును గిన్నిస్ బుక్ మంగళవారం ధృవీకరించింది.

లాగోస్ : కుకింగ్ మారథాన్‌లో 93 గంటల 11 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా నిలబడి వంట చేసిన నైజీరియన్ చెఫ్ హిల్దా బాసి.. సుదీర్ఘమైన సోలో వంట కేటగిరిలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకున్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ మంగళవారం ధృవీకరించింది.

గత నెలలో ఈ రికార్డు కోసం ఆమె నాలుగు రోజుల పాటు ఏకధాటిగా నిలబడి వంట చేసింది. దీనికోసం జిమ్‌లో శిక్షణ పొందారు హిల్డా బాసి (26). ఆమె మే 11-15 వరకు నాలుగు రోజులు వంట చేసింది. దీనివల్ల "నైజీరియన్ వంటకాలను ప్రపంచపటంలో చోటు కల్పించడానికి‘ సహాయపడుతుందని చెప్పింది.

"నైజీరియన్ వంటకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓ అమెరికన్ ఇంట్లో ఎగుసీ సూప్ చేయడం సాధారణ విషయంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని బాసి తన ప్రయత్నం తర్వాత పాత్రికేయులతో అన్నారు. అలాగే "సూపర్ మార్కెట్‌లోకి వెళ్లినప్పుడు చాలా మామూలుగా నైజీరియన్ పదార్థాలను కొనాలని కోరుకుంటున్నాను" అన్నారు.

చాలా మంది నైజీరియన్లు ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, ఇతర ఆర్థిక పోరాటాలతో సతమతమవుతున్న సమయంలో బాసీ రికార్డ్ ప్రయత్నం స్వదేశ దృష్టిని ఆకర్షించేలా చేసింది.

100 గంటలు వంట.. నైజీరియా మహిళ గిన్నిస్ రికార్డ్...

ఆమె వంట చేస్తున్నప్పుడు లాగోస్ రాష్ట్ర గవర్నర్, ఆ దేశ ఉపాధ్యక్షుడు, నైజీరియన్ ఆఫ్రోబీట్స్ మ్యూజిక్ స్టార్ తివా సావేజ్‌తో సహా అనేక మంది ప్రముఖ వ్యక్తులు బాసిని వచ్చి చూశారు. ఇది బాసీ మొదటి విజయం కాదు. అంతకు ముందు ఆమె ఒకసారి టెలివిజన్ లో వంట ప్రదర్శనను నిర్వహించింది. నైజీరియాకు ప్రాతినిధ్యం వహించి ప్రాంతీయ కుక్-ఆఫ్ పోటీలో స్పైసీ జోలోఫ్ రైస్ క్లాసిక్ వెస్ట్ ఆఫ్రికన్ వంటకాన్ని తయారు చేసింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది : "అన్ని సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇప్పుడు ఈ రికార్డును నిర్ధారించగలదు... హిల్డా బాసీ ఇప్పుడు అధికారికంగా వ్యక్తిగత విభాగంలో ఎక్కువ సమయం వంట మారథాన్ రికార్డును బద్దలు కొట్టింది" అని ప్రకటించింది.

ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డ్ అధికారులు చెబుతూ.. 2019లో ఒక భారతీయ చెఫ్ నెలకొల్పిన 87 గంటల 45 నిమిషాల రికార్డును ఆమె బద్దలు కొట్టినట్లు గిన్నిస్ తెలిపింది.