2019వ సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన మైకేల్ మేయర్, డైడియర్ క్యూలోజ్‌.. అమెరికాకు చెందిన జేమ్స్ పీబుల్స్‌లను ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.

భౌతిక విశ్వసృష్టిలో సైద్ధాంతిక ఆవిష్కరణతో పాటు సూర్యుడిని పోలివుండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాన్ని కనుగొన్నందుకు గాను వీరు ముగ్గురికి నోబెల్ దక్కింది.