ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులను "బందీలుగా" ఉంచినట్లు వచ్చిన వార్తలను భారత ప్రభుత్వం ఖండించింది. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని తెలిపింది.
ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులను "బందీలుగా" ఉంచినట్లు వచ్చిన వార్తలను భారత ప్రభుత్వం ఖండించింది. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని తెలిపింది. భారతీయ విద్యార్థులను బందీలుగా ఉన్నట్టు తమకు ఎలాంటి నివేదికలు లేవని వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ నుంచి ప్రకటన వెలువడింది.
‘ఏ ఒక్క భారతీయ విద్యార్థి బందీ పరిస్థితి గురించి మాకు నివేదికలు అందలేదు. ఖార్కివ్, పొరుగు ప్రాంతాల నుంచి విద్యార్థులను దేశం(ఉక్రెయిన్) పశ్చిమ భాగానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో మేము ఉక్రెయిన్ అధికారుల మద్దతును అభ్యర్థించాము’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.
ఉక్రెయిన్ భారతీయ విద్యార్థులను బందీలుగా పట్టుకున్నట్లు రష్యా బుధవారం ప్రకటించింది. ఖార్కివ్ నుండి భారతీయ విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ బలగాలు భారతీయులను బందీలుగా పట్టుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఉక్రెయిన్ సైనికులు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
రష్యా నుంచి వెలువడిన ప్రకటన నేపథ్యంలో పశ్చిమ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే భారతీయులు ఎవరూ కూడా బందీలుగా లేరని విదేశాంగ ప్రకటన చేసింది.
