Asianet News TeluguAsianet News Telugu

అక్కడ వ్యాక్సిన్ వేసుకోలేదో.. ఉద్యోగం ఊడినట్టే... !

ప్రభుత్వ ఉద్యోగులంతా ఆగస్టు 15 నాటికి టీకా మొదటి తీసుకోకపోతే సెలవులో వెళ్లాల్సి ఉంటుంది. నవంబర్ ఒకటికల్లా రెండో డోసు వేయించుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం. 

No Jabs, No Job : Fiji To Make Covid Vaccine Compulsory - bsb
Author
Hyderabad, First Published Jul 9, 2021, 1:15 PM IST

ఫిజీ : కొత్త కొత్త మ్యుటేషన్లతో కరోనా వైరస్ చూపిస్తోన్న ఉగ్ర రూపానికి ప్రతి దేశమూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ ప్రభావాన్ని కొద్దిమేర అయినా తగ్గించేందుకు టీకాలు వేయించుకోవాలని ఆయా దేశాలు ప్రజలను కోరుతున్నాయి. అయితే టీకా గురించి పెద్దగా పట్టించుకోని వారి విషయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకునేందుకు పలు దేశాలు వెనుకాడటం లేదు.  తాజాగా ఫిజీ ఆ తరహా నిర్ణయమే తీసుకుంది. ‘టీకాలు తీసుకోకపోతే.. ఉద్యోగాలు ఉండవు’ అంటూ హెచ్చరించింది.

ప్రభుత్వ ఉద్యోగులంతా ఆగస్టు 15 నాటికి టీకా మొదటి తీసుకోకపోతే సెలవులో వెళ్లాల్సి ఉంటుంది. నవంబర్ ఒకటికల్లా రెండో డోసు వేయించుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం. అలాగే ప్రైవేటు ఉద్యోగులు ఆగస్టు 1 కల్లా మొదటి డోసు వేయించుకోవాలి. 

లేకపోతే వ్యక్తిగతంగా భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది.  సంస్థలు మూసి వేసుకోవాల్సి వస్తుంది.  తీసుకోకపోతే ఉద్యోగాలు ఉండవు.  అంటూ ఫిజి ప్రధాని ఫ్రాంక్ బై నిమా రామ తీవ్ర హెచ్చరిక చేశారు.

ఒకవైపు డెల్టా వేరియంట్ తో సహా కొత్త రకాలు విజృంభిస్తుండగా.... కోవిడ్ నిబంధనల విషయంలో ప్రజల నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వాన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తుంది. ఈ క్రమంలోనే కఠిన విధానాన్ని తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా ఏప్రిల్ వరకు ఫిజీ లో వైరస్ సామాజిక వ్యాప్తి లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

కానీ ఇప్పుడు అక్కడ నిత్యం 700కు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.  అందుకు డెల్టా వేరియంటే మూల కారణం.  ఈ ఉధృతితో అక్కడి వైద్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మార్చురీలో శవాలు నిండి పోతూ ఉండడంతో మృతదేహాలను తీసుకెళ్లాలని కుటుంబసభ్యులను వేడుకోవాల్సి వస్తోంది.  ఈ సమయంలో లాక్ డౌన్ విధించాలంటూ అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుండగా ప్రధాని ఆ డిమాండ్ తోసిపుచ్చారు.

లాక్ డౌన్ కరోనాను చంపదు అని నిపుణులు చెప్పారు. కానీ అది ఉద్యోగాలు, దేశ భవిష్యత్తును చంపేస్తుంది.. అని వ్యాఖ్యానించారు.  సుమారు తొమ్మిది లక్షల మంది జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటి వరకు దాదాపు 3,40,000 వేల మందికి వయోజనులు టీకా మొదటి డోసు వేయించుకున్నారు.  వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం..  ఆ దేశంలో 8600 కేసులు.. 48 మరణాలు సంభవించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios