పారిస్:ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉపాధ్యాయుడిని  తల నరికి అత్యంత దారుణంగా  హత్య చేశారు.  చెచెనీయాకు చెందిన యువకుడు టీచర్ ను చంపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు బాధ్యదుడిగా భావిస్తున్న యువకుడిని పోలీసుల కాల్పుల్లో మరణించాడు.

ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఎటాక్ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ ప్రకటించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.పారిస్ కు వాయువ్యంగా ఉన్న కాన్ఫ్లాన్స్ సెయింట్ హునోరిన్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.

మృతుడిని 47  ఏళ్ల చరిత్ర ఉపాధ్యాయుడు శామ్యూల్ పాటీ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై క్లాస్ రూమ్ లో  కొన్ని కార్టూన్లను టీచర్ చూపాడని పోలీసులు చెప్పారు.
నిందితుల సోదరులతో, అతని తాత, మామ, ఇద్దరు మొదట పోలీసులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై ఫ్రాన్స్ యాంటీ టెర్రరిజం ప్రాసిక్యూటర్ విచారణ ప్రారంభించారు. మూడు వారాల్లో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి. త్వరలో ఇస్లామిక్ రాడికల్స్ కు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.