దుబాయ్:పెళ్లైన మూడు నిమిషాలకే పెళ్లి కూతురు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. పెళ్లి కొడుకు తనను  వెక్కిరించాడని పెళ్లికూతురు విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

తనను స్టూపిడ్ అంటూ తిట్టాడని కూడ పెళ్లి కూతురు ఆరోపిస్తోంది. అతడి ప్రవర్తన నచ్చకే విడాకులను కోరినట్టుగా ఆమె చెబుతోంది.

ఈ విడాకుల విషయాన్ని పెళ్లి కూతురే స్వయంగా  సోషల్ మీడియాలో ప్రస్తావించింది. ఈ విషయమై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.  తలో రకంగా నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

కొందరు పెళ్లి కూతురును సపోర్ట్ చేస్తే, మరికొందరు  పెళ్లి కొడుకును సపోర్ట్ చేశారు. అయితే పెళ్లి చేసుకొన్న మూడు నిమిషాలకే విడాకులు తీసుకోవాలని  నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీస్తోంది. ఈ ఘటన కువైట్‌లో చోటు చేసుకొంది.