Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్ : ఆరునెలల్లో మొదటి కోవిడ్ సంబంధిత మరణం..

న్యూజిలాండ్‌లో కోవిడ్ -19 తో మరణించిన 27 వ వ్యక్తి ఆమె. ఈ సంవత్సరం ఫిబ్రవరి 16 తర్వాత నమోదైన మొదటి మరణం ఆమెదే. 1.7 మిలియన్ల జనాభా కలిగిన న్యూజిలాండ్‌లోని అతి పెద్ద నగరం ఆక్లాండ్‌.  ఇక్కడ ఇదివరకే వైరస్  పాజిటివ్  వచ్చిన వ్యక్తితో ఆమెకు సోకిందని అధికారులు తెలిపారు.
 

New Zealand Records First Covid-Related Death In 6 Months
Author
Hyderabad, First Published Sep 4, 2021, 1:40 PM IST

వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ లో గత ఆరు నెలల్లో శనివారం మొదటి కోవిడ్ సంబంధిత మరణాన్ని నమోదు చేసింది. అయితే, ఆరోగ్య అధికారులు మాత్రం ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తున్నట్లు సంకేతాలు ఉన్నట్లు తెలిపారు.

చనిపోయిన మహిళ 90 యేళ్ల  వృద్దురాలు. ఆమెను అనేక ఆరోగ్య సంబంధిత  సమస్యలు ఉన్నాయి. అయితే ఆమెకు వెంటిలేటర్ లేదా ఇంటెన్సివ్ కేర్ సపోర్ట్ అందక శుక్రవారం రాత్రి ఆక్లాండ్ ఆసుపత్రిలో మరణించింది.

న్యూజిలాండ్‌లో కోవిడ్ -19 తో మరణించిన 27 వ వ్యక్తి ఆమె. ఈ సంవత్సరం ఫిబ్రవరి 16 తర్వాత నమోదైన మొదటి మరణం ఆమెదే. 1.7 మిలియన్ల జనాభా కలిగిన న్యూజిలాండ్‌లోని అతి పెద్ద నగరం ఆక్లాండ్‌.  ఇక్కడ ఇదివరకే వైరస్  పాజిటివ్  వచ్చిన వ్యక్తితో ఆమెకు సోకిందని అధికారులు తెలిపారు.

న్యూజిలాండ్ కరోనావైరస్ వ్యాప్తితో పోరాడుతోంది. గత ఆరు నెలల్లో మొదటిసారిగా లొకాలిటీ ట్రాన్స్ మీట్ అయిన కేసుగా దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఈ  కేసు ఆగస్టు మధ్యలో కనుగొనబడింది. దేశంలోని ఐదు మిలియన్ల మంది ఇప్పుడు లాక్డౌ న్ లో ఉన్నారు. అప్పటి నుండి, 782 కేసులు నమోదు చేయబడ్డాయి, ప్రధానంగా ఆక్లాండ్‌లో కోవిడ్  ఆంక్షలు తీవ్రంగా ఉన్నాయి. మిగిలిన దేశాలు ఆంక్షలను సడలించాయి.

ఇప్పుడు మేము తీసుకుంటున్న చర్యలు చాలా ముఖ్యమైనవని ఈ మరణం మరోసారి గుర్తు చేసింది.. అని ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ అన్నారు. న్యూజిలాండ్ పౌరులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రస్తుతం వైరస్ ప్రమాదానికి అతి దగ్గరలో ఉన్నారని.. లాక్ డౌన్ ఒక్కడే దీని వ్యాప్తిని ఆపే సాధనం అని ఆయన అన్నారు.  

గత వారాంతంలో 84 కేసుల నమోదుతో గరిష్ట స్థాయికి చేరిన కేసులు.. శనివారం నాడు కేవలం 20 మాత్రమే పాజిటివ్ కేసులుగా తేలాయి.  పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కరోలిన్ మెక్‌న్లే, గత వారం రోజులుగా తగ్గుతున్న సంఖ్యలను "ప్రోత్సాహకరంగా" అభివర్ణించారు. "వైరస్ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడంలో విజయం సాధిస్తున్నాము" అని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios