స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో పోస్టు పెడుతుంటారు. ఎందరినో తనవైపు మలుచుకుంటారు. ఇటీవలే ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కూ కౌంటర్ ఇచ్చారు. రష్యా దాడితో అల్లాడుతున్న ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ స్టేషన్లు పంపి సహకరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అమెరికా అధ్యక్షుడిగా సరిగ్గా సరిపోతారని, వచ్చే ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగాలని నెటిజన్లు ట్వీట్లు చేశారు.
న్యూఢిల్లీ: స్పేస్ ఎక్స్(Space X), టెస్లా (Tesla) మోటార్స్ సీఈవో ఎలన్ మస్క్ (Elon Musk)కు నెటిజన్లలో మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఆయన ముందు నుంచీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనదైన చమత్కారాలు, విసుర్లు, కామెంట్లతో నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. దీనికి తోడు ఇటీవల రష్యా దాడులతో చితికిపోతున్న ఉక్రెయిన్‌కు సహాయం అందించినప్పటి నుంచి ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగింది. ఎంతంటే.. ఆయనను అమెరికా అధ్యక్షుడి (America President)గా చేయాలనేంతగా ఆయనకు ఆదరణ వచ్చింది.
ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేయడమే కాదు.. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కామెంట్‌ను ట్విట్టర్‌లో నిలదీయం చర్చను లేవదీసింది. దీంతో ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడిగా సరిపోతారని, ఆయన సూపర్ ప్రెసిడెంట్ అవుతారని ట్విట్టర్ యూజర్లు పేర్కొన్నారు.
2018లో అమెరికా అధ్యక్షుడిగా ఎలన్ మస్క్ పోటీ చేయాలని ఓ ట్విట్టర్ యూజర్ పేర్కొన్నాడు. ఎలన్ మస్క్ దక్షిణాఫ్రికాకు చెందినవాడు కావడం బాధాకరం అని, 2028లో ఆయన అమెరికా అధ్యక్ష బరిలో దిగితే.. డొనాల్డ్ ట్రంప్ తర్వాత అద్బుతమైన అమెరికా అధ్యక్షుడిగా ఉంటాడని మరో యూజర్ ట్వీట్ చేశాడు. అమెరికాకు గొప్ప అధ్యక్షుడిగా ఎలన్ మస్క్ ఎదుగుతాడని తాను భావిస్తున్నానని, తనలాగే ఇంకెవరైనా ఆలోచిస్తున్నారా? అంటూ ఇంకొక నెటిజన్ పోస్టు చేశాడు. ఒక వేళ ఆయన అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తే.. తన ఓటు ఆయనకేనని మరొకరు ట్వీట్ చేశాడు.
రష్యా దాడితో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతున్నాయని, తమకు ఎలన్ మస్క్ స్టార్‌లింక్ స్టేషన్లు అందించి ఆదుకోవాలని ఉక్రెయిన్ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనికి ఎలన్ మస్క్ సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్ దేశానికి ఎలన్ మస్క్ స్టార్‌లింక్ స్టేషన్లు అందించి సహకరించారు.
ఎలక్ట్రానిక్ వెహికల్స్ ద్వారా ఫోర్డ్, జనరల్ మోటార్స్ పెద్ద మొత్తంలో ఉద్యోగాలు సృష్టించాయని జో బైడెన్ ఇటీవలే ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు సమాధానంగా ఎలన్ మస్క్ రెస్పాండ్ అయ్యారు. ఆ రెండు కంపెనీల కంటే తమ టెస్లా కంపెనీ గణనీయంగా ఉపాధి కల్పించిందని గణాంకాలు సమర్పించారు.
ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా ఉక్రెయిన్ లోని కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీశాయి రష్యాన్ బలాగాలు. ఈ క్రమంలోనే పవర్ గ్రిడ్‌లను, సెల్ టవర్స్ ను పేల్చివేయడం ద్వారా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఆ సందర్భంలో మస్క్ స్పందించి సహాయ హస్తం అందించారు.
