ఖాట్మాండ్: భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. మరో 25 మంది ఆచూకీ గల్లంతైంది. ఖాట్మాండ్ లోని  సింధుపాల్ చౌక్ జిల్లాలోని బర్హాన్ బిసి రూరల్ మున్సిపాలిటీ -7లో  ఈ ఘటన చోటు చేసుకొంది.

కొండచరియలు విరిగిపడడంతో 9 ఇళ్లు కొండచరియల కింద చిక్కుకున్నాయని బర్హాన్ బిసి రూరల్ మున్సిపాలిటీ -7 ఛైర్మెన్  నిమ్ పింజో షెర్పా ప్రకటించారు.కొండచరియలు పడడంతో 9 ఇళ్లు వీటి కిందే ఉన్నట్టుగా తమకు సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఎంత మంది ఈ ఘటనలో మరణించారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అనుమానిస్తున్నారు.విషయం తెలిసిన వెంటనే నేపాల్ ఆర్మీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. నేపాల్ పోలీసులు, ఇతర అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.