లోయలో పడిన బస్సు...20మంది మృతి

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 15, Dec 2018, 3:32 PM IST
Nepal accident: Truck crash kills 20 mourners, injure dozens
Highlights

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 20మంది మృత్యువాతపడగా... మరో 17మంది తీవ్రగాయాలపాలయ్యారు.


నేపాల్ లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 20మంది మృత్యువాతపడగా... మరో 17మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఖాట్మాండ్ సీమీపంలోని నువాకోట్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అధికారుల సమాచారం ప్రకారం.. గయాంగడండా ప్రాంతంలో కొండపై నుంచి వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి 100మీటర్ల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. బస్సులో పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిఉటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

loader