Asianet News TeluguAsianet News Telugu

హ్యాకర్ల చేతిలో 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల డేటా.. ఒక్కో దేశానికి ఒక్కో రేటు, ఆ కాల్స్‌కి స్పందించొద్దు

అడ్డదారిలో సంపాదించేందుకు హ్యాకర్లు దేనిని వదలడం లేదు. తాజాగా 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారుల డేటాను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్లు సైబర్ న్యూస్ నివేదించింది.
 

Nearly 500 Mn Users Phone Numbers At Risk due to whatsapp data leak
Author
First Published Nov 26, 2022, 9:33 PM IST

వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారుల డేటా లీక్ అయ్యిందని సైబర్ న్యూస్ నివేదిక వెల్లడించింది. అమెరికా సహా పలు దేశాలకు చెందిన దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నెంబర్లను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి వుంచారని తెలిపింది. ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరంలో ఫోన్ నెంబర్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన ఇచ్చినట్లుగా సైబర్ న్యూస్ నివేదించింది. 48.7 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నెంబర్లతో 2022 డేటా బేస్‌ను విక్రయిస్తున్నట్లుగా ఓ హ్యాకర్ ఆన్‌లైన్‌లో ఈ ప్రకటన ఇచ్చాడని తెలిపింది. 

భారత్, అమెరికా, యూకే, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా సహా 84 దేశాలకు చెందిన యూజర్ల నెంబర్లను హ్యాకర్లు అమ్మకానికి పెట్టినట్లుగా సైబర్ న్యూస్ తెలిపింది. అత్యధికంగా ఈజిప్ట్‌కు చెందిన 4.5 కోట్ల మంది హ్యాకర్ల బారినపడగా.. ఇటలీకి చెందిన 3.5 కోట్లు, అమెరికా నుంచి 3.2 కోట్లు, సౌదీ అరేబియా నుంచి 2.9 కోట్లు, ఫ్రాన్స్  నుంచి 2 కోట్లు, టర్కీ నుంచి 2 కోట్లు , యూకే నుంచి 1.1 కోట్ల మంది, రష్యా నుంచి కోటి మంది వాట్సాప్ యూజర్ల నెంబర్లు లీక్ అయినట్లు సైబర్ న్యూస్ నివేదించింది. 

ALso Read:అదర్ పూనావాలా అని నమ్మించి ‘సీరం’ నుంచి కోటి రూపాయాల మోసం.. ఎలాగంటే?

ఒక్కో దేశానికి చెందిన యూజర్ల డేటాకు ఒక్కొక్క ధర నిర్ణయించారని , అమెరికా డేటా అయితే 7 వేల డాలర్లు, యూకే డేటా అయితే 2,500 డాలర్లు , జర్మనీకి 2,000 డాలర్లు ధర పెట్టారని తెలిపింది. ఒకవేళ నేరగాళ్లు ఆ నెంబర్లను కొంటే .. మోసాలకు పాల్పడే ప్రమాదం వుందని గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లు వస్తే స్పందించొద్దని వినియోగదారులను హెచ్చరించింది. 

ఇకపోతే.. సీరం సంస్థను ఆ కంపెనీ అధినేత అదర్ పూనావాలాగా నమ్మించి కోటి రూపాయాలు కొట్టేశారు కేటుగాళ్లు. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ పోలీసు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీరం సీఈవో అదర్ పూనావాలాగా నటిస్తూ ఓ వ్యక్తి తనకు వాట్సాప్‌లో మెసేజీ పెట్టాడని డైరెక్టర్ సతీశ్ దేశ్‌పాండే కంప్లైంట్ చేశాడు. ఏడు ఖాతాల్లోకి డబ్బులు పంపాలని 2022 సెప్టెంబర్‌లో తనకు మెస్సేజీ పెట్టాడని వివరించాడు. ఆ మెస్సేజీ అదర్ పూనావాలాదే అనుకుని సతీశ్ దేశ్‌పాండే రూ 1.01 కోట్లను ఆ ఖాతాల్లోకి పంపించానని తెలిపాడు. ఆ తర్వాతే గుర్తు తెలియని వ్యక్తులు కంపెనీని చీట్ చేసినట్టు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ డబ్బును ఏడు బ్యాంకు ఖాతాల్లోకి పంపినట్టు తెలిసిందని, ఆ ఏడుగురు ఖాతాదారులను దేశంలోని పలు ప్రాంతాల  నుంచి అరెస్టు చేసినట్టు జోన్ 2 డీసీపీ స్మర్తానా పాటిల్ వివరించారు. అయితే, ప్రధాన నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడని చెప్పారు. ఈ ఏడు ఖాతాలతోపాటు వాటి నుంచి డబ్బులు బదిలీ అయిన మరో 40 అకౌంట్లను సీజ్ చేసినట్టు ఆమె తెలిపారు. అంతేకాదు, తాము రూ. 13 లక్షలను ఖాతాల్లోనే ఫ్రోజ్ చేసినట్టు వివరించారు. పూణె సిటీ పోలీసు సైబర్ యూనిట్ శుక్రవారం ఈ కేసులోని ముగ్గురిని నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటి వరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్టు పోలీసు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios