కూతురు సహా నవాజ్ అరెస్టు: హెలికాప్టర్ లో జైలుకు తరలింపు

First Published 13, Jul 2018, 10:24 PM IST
Nawaz, Maryam arrested in Lahore
Highlights

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను, ఆయన కూతురు మార్యమ్ షరీఫ్ ను లాహోర్ లో అరెస్టు చేసి, హెలికాప్టర్ లో ఇస్లామాబాద్ జైలుకు తరలించారు

లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను, ఆయన కూతురు మార్యమ్ షరీఫ్ ను లాహోర్ లో అరెస్టు చేసి, హెలికాప్టర్ లో రావల్పిండి జైలుకు తరలించారు. విమానంలో వారు రాత్రి లాహోర్ కు వచ్చారు. వారు దిగిన వెంటనే పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.

వారి కోసం ఉదయం నుంచి ఎదురుచూస్తున్న పోలీసులు విమానం నుంచి కింద కాలుపెట్టగానే అరెస్ట్ చేశారు. విమానాశ్రయం నవాజ్ అభిమానులు, ఆయన పార్టీ మద్దతుదారులతో కిక్కిరిసిపోయింది. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అక్రమాస్తుల కేసులో షరీఫ్, ఆయన కుమార్తె మర్యం నవాజ్‌లను దోషులుగా తేల్చిన అకౌంటబులిటీ కోర్టు గత శుక్రవారం జైలు శిక్ష విధించింది. నవాజ్‌కు పదేళ్లు, మర్యంకు ఏడేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

loader