Asianet News TeluguAsianet News Telugu

నిద్రించే జాబ్ ఆఫర్ చేస్తున్న నాసా.. రెండు నెలలకు రూ. 15 లక్షల జీతం

కేవలం నిద్రపోతే చాలు లక్షల జీతం ఇవ్వడానికి నాసా సిద్ధమైంది. ఇందుకోసం ఓ జాబ్ ఆఫర్ చేసింది. గురుత్వాకర్షణ శక్తికి సంబంధించి ప్రయోగాలకు వాలంటీర్లను రిక్రూట్ చేసుకుంటున్న నాసా 24 మంది వాలంటీర్లను రెండు రోజులు బెడ్ రెస్ట్ కోసం ఆహ్వానిస్తున్నది. ఇందుకోసం అది రూ. 15 లక్షల వరకు చెల్లించనుంది.
 

nasa offering sleep job giving rs 15 lakh salary
Author
First Published Dec 30, 2022, 2:02 PM IST

న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో పని చేయాలని, ఫిజిక్స్ పై మంచి పట్టు ఉండాలని అనుకుంటున్నారా? దీన్ని తప్పు అని చెబుతూ నాసా కేవలం నిద్రించే జాబ్ ఆఫర్ ప్రకటించింది. రెండు నెలలు బెడ్ పై పడుకుంటే చాలు వారికి 18,500 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 15,31,920)లు ఇవ్వనున్నట్టు తెలిపింది. కృత్రిమ గురుత్వ శక్తి మానవ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని కనుగొనడానికి పరిశోధనలు చేస్తున్నది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఆర్టిఫిషియల్ గ్రావిటీ బెడ్ రెస్ట్ స్టడీని జర్మన్ ఏరో స్పేస్ సెంటర్‌లో మొదలు పెట్టింది.

తొలిసారి పరిశోధకులు సింథటిక్ గ్రావిటీని వినియోగించడంపై చూపు సారించారు. భార రహిత స్థితిలో మన శరీరానికి ఎదురయ్యే ముప్పుకు విరుగుడు కోసం ప్రయోగాలు చేస్తున్నారు. ఇందు కోసం పరిశోధకులు 12 మంది పురుషులు, 12 మంది మహిళలను 60 రోజులపాటు బెడ్ పై నిద్రించేలా చేయనున్నారు. 24 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు ఉండి జర్మనీ భాషలో కమ్యూనికేట్ చేయగలిగే వారిని ఎంపిక చేసుకుంటున్నది.

జర్మనీ ఏరో స్పేస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సెటప్‌లో వీరిని బెడ్ పై పడుకుంటారు. ఈ బెడ్ రెస్ట్ సమయంలో మీల్స్ సహా ఇతర అన్ని రకాల ప్రయోగాలు వారిపై చేస్తారు. మొత్తం ఈ వాలంటీర్లు 89 రోజులు అక్కడ ఉండాల్సి ఉంటుంది. 60 రోజుల బెడ్ రెస్ట్‌కు వెనుకా ముందు 14 రోజుల రెస్ట్, ఆస్ట్రోనాట్ థెరపీలు చేస్తారు. అలాగే, ఐదు రోజుల ఫెమిలియరైజేషన్ కూడా ఉంటుంది.

Also Read: 183 రోజుల తరువాత.. క్షేమంగా భూమికి చేరుకున్న చైనా వ్యోమగాములు..

బెడ్ రెస్ట్ సమయంలో వాలంటీర్ల కదలికలు దాదాపు ఉండకుండా చూస్తారు. వాటి ద్వారా అస్థిపంజరం, కండరాలు, ఇతర అవయవాలు కదలకుండా ఉంచి పరిశీలనలు చేస్తారు. తల వైపు వారి బెడ్ ఆరు డిగ్రీలు కిందికి వంచి రోదసిలో ఉంటే వ్యోమగాముల శరీరాల్లో ద్రావకాలు ఎలాగైతే మెదులుతాయో అలా చేస్తారు. 

గ్రావిటీ చాంబర్‌ లో చేసే టెస్టు ఇందులో సగం మందిపై చేస్తారు. దీని కోసం అపకేంద్రణ యంత్రం వంటి దానిలో వారిని ఉంచి నిమిషానికి 30 కక్ష్యలు తిరిగేలా చేస్తారు. రక్తం దాని తీవ్ర స్థితికి చేరుకునేలా చేస్తారు. అప్పుడు వాలంటీర్ల శరీరాల్లోని మార్పులను రికార్డు చేసి అధ్యయనం చేస్తారు. ఈ ప్రయోగాల కోసమే 24 మంది వాలంటీర్లను నాసా తీసుకుంటున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios