Asianet News TeluguAsianet News Telugu

183 రోజుల తరువాత.. క్షేమంగా భూమికి చేరుకున్న చైనా వ్యోమగాములు.. 

ఆరు నెలల స్పేస్ మిషన్ తరువాత ముగ్గురు చైనా వ్యోమగాములు భూమికి సురక్షితంగా చేరారు. అంతరిక్ష కేంద్రంకు ముగ్గురు వ్యోమగాములను మోసుకెళ్లిన చైనా అంతరిక్ష నౌక షెనౌజౌ-14 ఆదివారం ఉత్తర ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లోని డాంగ ఫెంగ్ ల్యాండింగ్ సైట్ లో సురక్షితంగా ల్యాడ్ అయింది.

After a six-month mission, three Chinese astronauts return to Earth
Author
First Published Dec 5, 2022, 5:27 AM IST

అంతరిక్ష రంగంలో డ్రాగన్ కంట్రీ చైనా మరో ఘనత సాధించింది. ఆరు నెలల స్పేస్ మిషన్ తరువాత ముగ్గురు చైనా వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ముగ్గురు చైనా వ్యోమగాములతో  కూడిన షెన్‌జౌ-14 అంతరిక్ష నౌక ఆదివారం ఇన్నర్ మంగోలియాలోని డాంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్‌లో సురక్షితంగా దిగినట్టు అధికారులు తెలిపారు. ముగ్గురు వ్యోమగాములు చెన్, లియు, కై లు దాదాపు ఆరు నెలల పాటు ( 183 రోజులు) స్పేస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో నివసించారు.

ఈ ముగ్గురు వ్యోమగాములను జూన్ 5న షెంజౌ-14 వాహనం ద్వారా అంతరిక్ష కేంద్రానికి పంపారు. టియాంగాంగ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆరు నెలల పాటు శ్రమించిన తర్వాత ముగ్గురు చైనా వ్యోమగాములు ఆదివారం ఉత్తర ఎడారిలో దిగారు. అదే సమయంలో,  దిగడానికి ముందు.. ఫీ జులాంగ్, డెంగ్ క్వింగ్మింగ్,జాంగ్ లూ అనే ముగ్గురు వ్యోమగాములను మోసుకెళ్లే షెన్‌జౌ-15 అంతరిక్ష నౌకను చైనా మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారిగా ఆరుగురు చైనా వ్యోమగాములు ఒకేసారి అంతరిక్షంలోకి ప్రవేశించారు.

ల్యాండింగ్ అయిన 40 నిమిషాల తర్వాత వ్యోమగాములను వైద్య సిబ్బంది క్యాప్సూల్ నుండి బయటకు తీశారు. వారంతా  ల్యాండింగ్ సైట్‌లో నవ్వుతూ.. సంతోషంగా ఉన్నట్లు కనిపించారు. "ఆరు  నెలల పాటు అంతరిక్షంలో ఉండి.. చైనీస్ స్పేస్ స్టేషన్ యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు తాను చాలా అదృష్టవంతుడిని" అని క్యాప్సూల్ నుండి నిష్క్రమించిన మొదటి వ్యక్తి చెన్ అన్నారు.

వ్యోమగాములు అనేక పనులను పూర్తి చేశారని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (CSMA) తెలిపింది. వారు గత కొన్ని నెలలుగా డాకింగ్‌లను పర్యవేక్షించడం, మూడు ఎక్స్‌ట్రావెహిక్యులర్ కార్యకలాపాలు నిర్వహించడం, ఒక లైవ్ సైన్స్ లెక్చర్ ఇవ్వడం, నిర్వహించడం వంటి అనేక పనులను పూర్తి చేశారు. ప్రయోగాత్మక డేటాను డౌన్‌లోడ్ చేయడానికి వారు నవంబర్ 29న షెంజౌ-15 సిబ్బందితో వచ్చారు.  

అంతరిక్షరంగంలో అమెరికాతో చైనా తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది చివరి నాటికి అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి చేయాలని చైనా యోచిస్తోంది. ఒకసారి సిద్ధమైతే అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న ఏకైక దేశం చైనా అవుతుంది. రష్యా యొక్క అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) అనేక దేశాల సహకార ప్రాజెక్ట్. చైనా స్పేస్ స్టేషన్ (CSS) కూడా రష్యా నిర్మించిన ISS కు పోటీగా ఉంటుందని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios