లండన్: ఇంటర్నెట్‌ అంతరాయం కారణంగా పలు వెబ్‌సైట్ల కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. బీబీసీ, అమెజాన్, యూకే ప్రభుత్వ వెబ్‌సైట్లపై దీని ప్రభావం కన్పించింది. గార్డియన్, ఫైనాన్షియల్ టైమ్స్, ఇండిపెండెంట్, న్యూయార్క్ టైమ్స్, ఈవెనింగ్ స్టాండర్డ్, రెడిట్ లాంటి మీడియా వెబ్‌సైట్లపై కూడ ఈ ప్రభావం కన్పించింది.

కొన్ని వెబ్‌సైట్లు పూర్తిగా పనిచేయలేదు, మరికొన్ని పైట్లు చిన్న అవాంతరాలను ఎదుర్కొన్నాయి. ప్రపంచంలోని ప్రధాన కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ (సీడీఎన్)లలో ఫాస్ట్లీ సమస్య కారణంగా వెబ్‌సైట్లు క్రాష్ అయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సీడీఎన్ అనేది వెబ్‌పైట్లను వాటి కంటెంట్ ను ఇంటర్నెట్ లో హోస్ట్ చేయడానికి  వినియోగదారులకు అందించడానికి ఉపయోగించే వ్యవస్థ. సీడీఎన్ గ్లోబల్ నెట్‌వర్క్ లో అంతరాయం కలిగినట్టుగా చెబుతున్నారు.వెబ్‌సైట్ల కోసం లోడింగ్ సమయాన్ని వేగవంతం చేయడంతో పాటు సైబర్ దాడుల నుండి రక్షించడం ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కోవడానికి సీడీఎన్ పనిచేస్తోంది.