Asianet News TeluguAsianet News Telugu

మాజీ భర్తమీది కోపం.. ఐదుగురు పిల్లలకు మత్తుమందిచ్చి చంపిన కన్నతల్లికి...జీవితఖైదు

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డల్ని కర్కశంగా హతమార్చిన తల్లికి జర్మనీ కోర్టు జీవిత ఖైదు విధించింది. పదిహేనేళ్ల పాటు పెరోల్ కి అనర్హులుగా తీర్పు వెల్లడించింది. సోలింగెన్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల క్రిస్టియానె.కె గతేడాది సెప్టెంబర్లో తన ఆరుగురు బిడ్డల్లో ఐదుగురిని దారుణంగా హత్య చేసింది. 

Mother who killed five of her children in the bath jailed for life
Author
Hyderabad, First Published Nov 5, 2021, 7:42 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బెర్లిన్ :  పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల్ని కట్టుకున్నవాడి మీది కోపంతో.. క్షణాల్లో అనంతవాయువుల్లో కలిపేసింది ఓ కన్నతల్లి. అదీ ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం ఐదుగురిని ఒకేసారి హత్య చేసింది. వింటుంటూనే ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణమైన ఘటనలో మరో కొడుకు తప్పించుకున్నాడు. ఈ దారుణమైన ఘటనల బెర్లిన్ లో జరిగింది. 

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డల్ని కర్కశంగా హతమార్చిన తల్లికి జర్మనీ కోర్టు జీవిత ఖైదు విధించింది. పదిహేనేళ్ల పాటు పెరోల్ కి అనర్హులుగా తీర్పు వెల్లడించింది. సోలింగెన్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల క్రిస్టియానె.కె గతేడాది సెప్టెంబర్లో తన ఆరుగురు బిడ్డల్లో ఐదుగురిని దారుణంగా హత్య చేసింది.  

వారిలో ఒక సంవత్సరం రెండు, మూడేళ్ళ వయస్సున్న  ముగ్గురు కుమార్తెలు ఉండగా... ఆరు, ఎనిమిదేళ్ల వయసున్న  ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిని హత్య చేసి మృతదేహాలను వస్త్రంలో చుట్టి  బెడ్ పై పెట్టింది Christiane. మరో కుమారుడు  murders జరిగే సమయంలో  పాఠశాలలో ఉండడంతో ప్రాణాలు దక్కాయి.

అనంతరం తాను suicide చేసుకోవాలని క్రిస్టియానె రైలు కిందపడబోయింది. అయితే, అక్కడున్న స్థానికులు ఇది గమనించారు. అప్పటికి వారికి విషయం తెలియదు. ఎవరో చనిపోవడానకి ప్రయత్నిస్తున్నారి ఆమెను కాపాడారు.

పీవోకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 22 మంది మృతి..

ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా వారికి రోమాలు నిక్కబొడుచుకునే వాస్తవాలు తెలిశాయి. ఆ mother అప్పటికే తన childrenను అతి దారుణంగా హతమార్చిందని తెలిసి షాక్ అయ్యారు. వెంటనే క్రిస్టియానె ఇంటికి వెళ్లి పరిశీలించగా.. మొత్తం ఐదుగురు పిల్లలు విగతజీవులుగా కనిపించారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు dead అయినట్టు వైద్యులు దృవీకరించారు. 

అయితే, పిల్లల్ని చంపే ముందు వారికి chloroform కలిపిన అల్పాహారం ఇచ్చిందని.. అందుకే పిల్లలు అంత దారుణం జరుగుతున్నా ప్రతిఘటించలేదని.. ఒక్కరు కూడా బైటికి విషయం తెలిసేలా చేయలేదని కోర్టులో న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ food తిని మత్తులోకి వెళ్లిన తరువాతే ఆ చిన్నారులను ఆమె హత్య చేసిందని అన్నారు.

కరోనా చికిత్స: శాస్త్రవేత్తల కృషి.. అందుబాటులోకి టాబ్లెట్, యూకే సర్కార్ ఆమోదం

ఈ హత్యలకు కారణం ఆమె మానసిక స్థితి ఆ సమయంలో సరిగా లేకపోవడమేనని చెప్పుకొచ్చారు. ఆరుగురు పిల్లలకు తల్లి అయిన తరువాత భర్త ఆమెను విడిచి పెట్టాడని... ఆమెకు దూరమైన Husband మరో మహిళతో కలిసి ఉన్నాడని.. ఆ ఫోటో చూసిన క్రిస్టియానా ఆవేశానికి గురైందని..  ఆ కోపంలోనే విచక్షణ మరిచి, పిల్లల్ని హత్య చేసిందని తెలిపారు. 

మరోవైపు తాను నిర్దోషినని ఇంట్లోకి ఓ దుండగుడు ముసుగు వేసుకుని వచ్చి.. హత్య చేశాడని క్రిస్టియానె తెలిపింది.  కానీ, విచారణలో ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే అని తేలడంతో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios