ఉద్యోగం ఇస్తామని ఆశ చూపి ఓ మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా.. ఆమె చిన్నారి కుమార్తెపైనా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అప్పటికీ అపస్మారక స్థితిలో వున్న వారిద్దరినీ ఆ దుర్మార్గులు అమ్మేశారు. 

వివరాల్లోకి వెళితే... పాకిస్థాన్‌లోని కశ్మోర్‌లో నెలకు రూ. 40 జీతం వచ్చే ఉద్యోగం ఇస్తామని ఓ మహిళను పిలిపించుకున్న కొందరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మహిళతో పాటు తనతో ఉన్న చిన్నారిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ దుర్మార్గులు అమ్మాయిల విక్రేతకు అమ్మేశారు.   

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, కూతురిని విక్రేత వద్ద నుంచి విడిపించి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రివర్గాలు పేర్కొన్నాయి. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.