రష్యా విమానాలపై బ్యాన్ విధించడంతో యూకేకి రష్యా కౌంటరిచ్చింది. గురువారం నాడే రష్యా విమానాలపై బ్రిటన్ నిషేధం విధించింది. 

మాస్కో:Ukraine పై మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించిన Russiaపై UK ఆంక్షలు విధించింది. రష్యాకు చెందిన విమానాలకు యూకే అనుమతిని నిరాకరించింది. దీంతో రష్యా కూడా British విమానాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. రష్యాకు చెందిన కొన్ని బ్యాంకుల లావాదేవీలపై కూడా యూకే ఆంక్షలను కొనసాగిస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో రష్యా యూకే flightsకు తమ గగనతలంలోకి అనుమతిని నిరాకరించింది. 

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించడాన్ని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత రష్యన్ విమానాలపై యూకే నిషేధం విదించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా రష్యా ఈ నిర్ణయం తీసుకొంది. రష్యా పౌర విమాన శాఖ మంత్రి శుక్రవారం నాడు ఈ ప్రకటన చేశారు.

రష్యాకు చెందిన విమానాలు యూకే గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధించే ఆంక్షలను తాను సంతకం చేసినట్టుగా యూకే రవాణా కార్యదర్శి గ్రాంట్ షాప్స్ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించాు. ప్రజల ప్రాణాలను పుతిన్ ప్రమాదంలో పడేశారన్నారు. ఈ విషయాన్ని తాము ఎప్పటికీ కూడా సహించబోమన్నారు.ఉక్రెయిన్ పై రష్యా తన దాడులను కొనసాగిస్తుంది. గురువారం నాడు రాత్రితో పాటు శుక్రవారం నాడు కూడా ఈ దాడులు కొనసాగినట్టుగా అధికారులు ప్రకటించారు.

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను గురువారం నాడు ప్రారంభించింది. కొన్ని వారాలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిష్థితి గురువారం నాడు మిలటరీ ఆపరేషన్ కు దారి తీసింది. 

నాటోలో ఉక్రెయిన్ ను చేర్చుకోవద్దని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తన డిమాండ్ ను పునరుద్ధాటించారు. మరో వైపు రష్యా తనతో పాటు తన కుటుంబాన్ని టార్గెట్ చేసిందని జెలెన్ స్కీ తెలిపారు.

శుక్రవారం నాడు తెల్లవారుజామున Kyiv లో వరుస పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవతా థృక్పథంతో 20 మిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది. UNOసెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ ఈ విషయాన్ని గురువారం నాడు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ నుండి రూ. 20 మిలియన్ డార్లను తూర్పు లుహాన్స్క్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని అవసరమైన కార్యకలాపాలకు వినియోగిస్తామని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

నగరాలు, సైనిక స్థావరాలు, వైమానిక దాడుల తర్వాత కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యా దళాలు ముందుకు వెళ్తున్నాయి. ఉక్రెయిన్ పై దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ Putin సమర్ధించుకొన్నారు. గంట గంటకు ఉక్రెయిన్ పై రష్యా పట్టు సాధిస్తుంది. ఉక్రెయిన్ లోని నగరాలపై రష్యా దళాలు పట్టు సాధిస్తున్నాయి. కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యా ప్రయత్నిస్తోంది.ఉక్రెయిన్ పై రష్యా మిలటరీని నిరసిస్తూ రష్యాలోని పలు చోట్ల వందలాది మంది నిరసనలు సాగాయి. నిరసనలకు దిగిన వారిని రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు.