Russia Ukraine Crisis: ఉక్రెయిన్ లో నుంచి వరస వెళ్లే వారి సంఖ్య 70 లక్షలకు చేరవచ్చని ఐక్యరాజ్య సమితి అంచానా వేస్తోంది. ఇది ఈ శతాబ్ధంలోనే అతి పెద్ద సంక్షోభం అని అంటోంది. 1.80 కోట్ల మంది ప్రజలపై యుద్ధం ప్రభావం ఉంటుందని అంచనా.
Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. గత 12 రోజులుగా.. రష్యా నిరంతర దాడులతో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. ఖేర్సన్‌ను ఆక్రమించిన రష్యా బలగాలు.. సముద్ర తీర ప్రాంతాలైన మరియుపోల్, వోల్నోవాఖ నగరాలను చుట్టుముట్టాయి. కీవ్‌పై రష్యా దళాలు బాంబు దాడులను కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకోవాలని రష్యా తీవ్రంగా యత్నిస్తున్నాయి. అయితే, ఉక్రేనియన్ బలగాలు కూడా చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.
ఈ క్రమంలో ఎటు చూసినా.. బాంబు పేలుళ్లు, మిసెల్స్ దాడులు.. భీతావహ పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఉక్రెయిన్ నగరాలు.. శ్మశానాల్లా మారాయి. ఎక్కడ చూసినా.. శవాలు.. రక్తం ఏరులై పారుతోంది. దీంతో ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. రష్యా దాడుల్లో ఆ దేశ ప్రజలే కాదు.. అక్కడ నివాసం ఉంటున్న ఇతర దేశాల ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే యుద్దం తక్షణమే నిలివేయాలని ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. దాదాపు 1.7 మిలియన్ల మంది ఉక్రెయిన్ ప్రజలు దేశం విడిచి పారిపోయారు. UN శరణార్థి ఏజెన్సీ , UNHCR ఏజెస్సీ అధికార గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 24న రష్యా పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి 1,735,068 మంది ప్రజలు ఉక్రెయిన్ నుండి పారిపోయారని తెలిపింది. వీరిలో దాదాపు సగం మంది పిల్లలు, యువకులేనని UNICEF అభిప్రాయపడింది.
రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు చేరువవుతున్నందున తరుణం నుంచి వలసలు అధికమనట్టు గుర్తించాయి అంతర్జాతీయ సంస్థలు. గత వారం దాడికి ముందు 37 మిలియన్లకు పైగా ప్రజలు కైవ్ ప్రభుత్వ నియంత్రణలో నివసించారని తెలిపాయి. ఉక్రెయిన్‌లో సైనిక దాడి వల్ల పౌర మౌలిక సదుపాయాల ధ్వంసం, ఈ దాడిలో చాలా మంది పౌరుల కోల్పోయారని, భద్రత, రక్షణ సహాయం కోరుతూ ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయేలా చేసిందని UNHCR పేర్కొంది.
ఈ ఘర్షణలు ఇలానే కొనసాగితే.. మరో నాలుగు మిలియన్ల మంది ప్రజలు ఉక్రెయిన్ నుండి పారిపోవచ్చని అంచనా వేస్తున్నాయి. దేశంలోని అనేక మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారని పేర్కొంది. ప్రధానంగా.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు పోలాండ్, రొమేనియా, హంగేరి దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. యూఎన్ఓ శరణార్థి సంస్థ అంచన ప్రకారం..
పోలాండ్ -
ఉక్రెయిన్ నుంచి పారిపోయిన వారిలో 10 మందిలో ఆరుగురు ఇప్పుడు పోలాండ్‌లో ఉన్నారు. సోమవారం ప్రచురించిన UNCHR గణాంకాలు ప్రకారం.. ఉక్రెయిన్ యొక్క అతిపెద్ద పశ్చిమ పొరుగు దేశామైన పోలాండ్ లో 1,027,603 మంది శరణార్థులు తలదాచుకుంటున్నారని తెలింది. గత 24 గంటల్లో 142,300 మంది వలస వెళ్లినట్టు తెలిపారు. ఉక్రేనియన్ శరణార్థుల కోసం పోలాండ్ ప్రభుత్వం రిసెప్షన్ సెంటర్‌లను ఏర్పాటు చేసింది. స్వచ్ఛంద సంస్థలు భారీ సహాయ ప్రయత్నంలో సమాయత్తమయ్యాయి, అంచనా వేసిన 1.5 మిలియన్ల ఉక్రేనియన్లు ఇప్పటికే EU సభ్య దేశంలో నివసిస్తున్నారు.
హంగేరి : ఈ దేశంలో దాదాపు 180,163 మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఉక్రెయిన్ నుండి పారిపోయిన వారిలో 10 శాతం మంది హంగేరిలోనే ఉన్నారు. హంగేరి దేశంతో ఉక్రెయిన్ ఐదు సరిహద్దు క్రాసింగ్‌లను కలిగి ఉంది. జాహోనీతో సహా అనేక సరిహద్దు పట్టణాలు, ప్రజా భవనాలు, సహాయ కేంద్రాలుగా మార్చాయి, ఇక్కడ హంగేరియన్ పౌరులు ఆహారం లేదా సహాయం అందిస్తున్నారు.
స్లోవేకియా: ఉక్రెయిన్ తో అతి తక్కువ సరిహద్దులో గల దేశం. ఇప్పటి వరకూ దేశానికి దాదాపు 128,169 మంది శరణార్థులు వలస వెళ్లినట్టు తెలుస్తోంది. అంటే.. దాదాపు ఏడు శాతం మంది స్లోవేకియాలో ఆశ్రయం పొందుతున్నారు.
మోల్డోవా: ఈ దేశంలో దాదాపు 82,762 మంది శరణార్థులు ఉన్నారు, అయితే అనేక వేల మంది ఇతర దేశాలకు వెళ్లే మార్గంలో EU యేతర రాష్ట్రం గుండా వెళ్ళారు. అందుకే ఆదివారం నుండి ఈ సంఖ్య 1,305 తగ్గింది. UNHCR ప్రకారం.. చాలా మంది శరణార్థులు రొమేనియా లేదా హంగేరీలకు వలస వెళ్తున్నారు.
ఉక్రెయిన్ నుండి 230,000 మందికి పైగా ప్రజలు సరిహద్దులు దాటినట్లు ప్రధాన మంత్రి నటాలియా గావ్రిలిటా ఆదివారం తెలిపారు.
రొమేనియా: దాదాపు 78,977 మంది శరణార్థులు రొమేనియాలో ఉన్నారు.
రష్యా : దాడి తర్వాత ఉక్రెయిన్ ప్రజలు రష్యాలోకి ప్రవేశించారు. దాదాపు 53,000 శరణార్థులు రష్యాకు వెళ్లారు. రష్యా దండయాత్రకు ముందు రోజులలో(ఫిబ్రవరి 18 నుంచి 23 మధ్య) వేర్పాటువాద తూర్పు డొనెట్స్క్ , లుహాన్స్క్ ప్రాంతాల నుండి అదనంగా 96,000 మంది రష్యాకు తరలివెళ్లారని UNHCR పేర్కొంది.
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్దం వల్ల తీవ్ర మానవ సంక్షోభం తలెత్తింది. యుద్ధం కారణంగా చాలా మంది ఉక్రెయిన్ పౌరులు పొట్ట చేతిన పట్టుకుని పరాయి దేశాలకు వలస వెళ్తున్నారు. సరిహద్దు దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్ లో ఇంత పెద్ద ఎత్తున వలస జరగడం ఇదే మొదటిసారి అని యూఎన్ఓ శరణార్థి సంస్థ వెల్లడించింది.
