Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ కంటే కెనడా ప్రధానికే జై కొట్టిన అమెరికన్లు, ఎందుకంటే?

ట్రంప్ పై అమెరికన్ల అపనమ్మకం

More Americans side with Justin Trudeau than Donald Trump in trade spat: Ipsos poll

న్యూయార్క్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ట్రంప్ కంటే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కు తమ మద్దతును ప్రకటించి అమెరికన్లు ఆశ్చర్యపరిచారు.

జీ-7 దేశాల సదస్సు ముగిసిన తర్వాత వాణిజ్య ఒప్పందం అంశంలో ట్రంప్‌-ట్రూడోల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. ఈ నేపథ్యంలో కెనెడాలోని ఓ న్యూస్‌ ఏజెన్సీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఓ సర్వే నిర్వహించింది. 

ఇరు దేశాల ప్రజలు పాల్గొన్న ఐపీఎస్‌వోఎస్‌ సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. 72 శాతం మంది కెనడియన్లు, 57 శాతం మంది అమెరికన్లు ఈ పరిస్థితులను చక్కదిద్దే సత్తా ట్రూడోకే ఉందని తేల్చారు. 14 మంది కెనడియన్లు, 37 శాతం అమెరికన్లు మాత్రమే ట్రంప్‌కు మద్ధతుగా నిలిచారు.  మెజార్టీ అమెరికన్లు ట్రంప్‌ పనితీరుపై అపనమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఇక మెజార్టీ ప్రజలు మాత్రం ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎన్‌ఏఎఫ్‌టీఏ)-1994ను సవరించాలన్న ట్రంప్‌ నిర్ణయంపై కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. 

అయితే 70 శాతం మంది కెనడియన్లు తాము అమెరికా ఉత్పత్తులను బహిష్కరించాలనుకుంటున్నామని సర్వేలో పేర్కొన్నారు. ఇరు దేశాల అధినేతల మధ్య మాటల యుద్ధంతో ద్వైపాక్షిక ఒప్పందాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్‌ 13-14 తేదీల్లో ఈ సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలు బయటపడడం కలకలం రేపుతున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios