ఉలాన్‌బాతార్: కరోనాను కంట్రోల్ చేయలేక మంగోలియా ప్రధానమంత్రి ఖురేసుఖ్ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. కరోనా వైరస్  దేశాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాదిమంది ఈ వైరస్ బారినపడ్డారు.   అంతేకాదు వందలాది మంది చనిపోతున్నారు. 

కరోనా వైరస్ ను నియంత్రించలేక ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ దేశంలో కరోనా రెండో దశ ప్రారంభమైంది. ప్రతి రోజూ వందలాది కేసులు నమోదౌతున్నాయి. కరోనా సోకిన రోగితో పాటు ఆమె బిడ్డకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది.ఈ పరిణామం తీవ్ర నిరసనలకు కారణమైంది.

ఈ ఘటనను నిరసిస్తూ వందలాది మంది యువకులు ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహించారు. ఈ నిరసనలతో  ప్రధాని పదవికి ఖురేసుఖ్ ఉఖ్నా ప్రధాని పదవికి రాజీనామా చేశారు.  కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని తీవ్రంగా విమర్శలను సర్కార్ ఎదుర్కొంది. 

 కరోనా కట్టడిలో తొలుత మంగోలియా కఠినంగానే వ్యవహరించింది. ఆ తర్వాత కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం వైపల్యం చెందింది. దీంతో వైరస్ వ్యాప్తి పెరిగింది.