క్యాట్ వాక్ చేస్తూ కుప్పకూలి మోడల్ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సావో పోలోలో జరుగుతున్న ఫ్యాషన్ వీక్ ముగింపు రోజు కార్యక్రమంలో భాగంగా బ్రెజిల్ మోడల్ టేల్స్ సోర్స్ క్యాట్ వ్యాక్ చేస్తున్నాడు.

వాక్ ముగించి వెను తిరిగి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన టేల్స్.. రన్‌వేపై పడిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే సోర్స్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

మోడల్ టేల్స్ సోర్స్ మరణం పట్ల ఫ్యాషన్ వీక్ నిర్వాహకులు సహా తోటి మోడల్స్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.