వాషింగ్టన్: అమెరికాలోని మిస్సిసిపీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో తల్లి సహా ఆరుగురు పిల్లలు  సజీవ దహనమయ్యారు.ఈ ఘటన శనివారం  మధ్యాహ్నం చోటు చేసుకొంది. 

అమెరికాలోని మిస్సిసిపీలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 33 ఏళ్ల తల్లితో పాటు  ఆరుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. ఇంట్లో మంటలు ఎలా వ్యాప్తిం చెందాయనే విషయమై ఇంకా నిర్ధారణ కాలేదు.

ఈ ప్రమాదంలో  కుటుంబ యజమాని ప్రాణాలతో బయటపడ్డాడు.  అయితే తన కుటుంబసభ్యులను కాపాడేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించినట్టుగా అధికారులు చెప్పారు.  తమ కుటుంబసభ్యులన కాపాడేందుకు ప్రయత్నించిన అతను కూడ తీవ్రంగా గాయపడినట్టుగా అధికారులు ప్రకటించారు. 

ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టుగా అధికారులు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి ఇంకా వివరాలు అందాల్సి ఉంది.