శ్రీ షైని.. భారతీయురాలు కాగా.. అమెరికాలో సెటిలయ్యారు. ఆమె.. అమెరికా తరపు నుంచి... పోటీ చేసి.. మొదటి రన్నరప్ గా నిలిచారు.

Miss World 2021 పోటీలు ముగిశాయి. పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా అంతర్జాతీయ అందాల పోటీల్లో మిస్ వరల్డ్ 2021 టైటిల్‌ను గెలుచుకుంది. యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన భారతీయ-అమెరికన్ శ్రీ సైనీ మొదటి రన్నరప్ టైటిల్‌ను కైవసం చేసుకోగా, కోట్ డి ఐవోర్‌కు చెందిన ఒలివియా యాస్ రెండవ రన్నరప్‌గా నిలిచారు.

శ్రీ షైని.. భారతీయురాలు కాగా.. అమెరికాలో సెటిలయ్యారు. ఆమె.. అమెరికా తరపు నుంచి... పోటీ చేసి.. మొదటి రన్నరప్ గా నిలిచారు.

కోవిడ్-19 కారణంగా 2020లో ఆలస్యమైన తర్వాత ఈ పోటీ మార్చి 16న ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో జరిగింది.

View post on Instagram

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి మిస్ వరల్డ్ 2021లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె టాప్ 13 కంటెస్టెంట్‌లకు చేరుకుంది కానీ టాప్ 6 ఫైనలిస్ట్‌లలో చేరలేకపోయింది.

 మిస్ వరల్డ్ కిరీటం 2019 ప్రపంచ సుందరి జమైకాకు చెందిన టోని-ఆన్ సింగ్ నుంచి.. ఈ కిరిటాన్ని కరోలినా అందుకోవడం గమనార్హం. చివరగా... భారత్ నుంచి 2017లొ మానుషీ చిల్లర్... మిస్ వరల్డ్ కిరిటాన్ని కైవసం చేసుకుంది.

కాగా.. ఈ మిస్ వరల్డ్ 2021లో మొదటి రన్నరప్ గా నిలిచిన శ్రీ షైని... మిస్ వరల్డ్ అమెరికా 2021 విజేతగా నిలిచారు. ఈ అమ్మాయి వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందింది. అయితే ఆమెకు 12 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదం(Car Accident)లో ఎడమవైపు భాగం ముఖంతో సహా అంతా కాలిపోయింది. పైగా ఆమె జీవితాంత పేస్‌మేకర్‌ (కృత్రిమ గుండె) సాయంతోనే బతకాలి. అయినప్పటికీ మెుక్కవోనీ దీక్షతో వీటిన్నంటిని అధిగమించి మరీ మిస్‌ వరల్డ్‌ అమెరికా(Miss World AMerica 2021) కిరీటాన్ని గెలుచుకుంది. అమెరికాకు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత సంతతి మహిళగా షైనీ గుర్తింపు పొందడం గమనార్హం.