కాస్త వర్షం పడితే చాలు.. రోడ్డు మీద గుంతలు కనపడతాయి. ఆ గుంతల కారణంగా ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నా... అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు.
కాస్త వర్షం పడితే చాలు.. రోడ్డు మీద గుంతలు కనపడతాయి. ఆ గుంతల కారణంగా ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నా... అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. ఈ గుంతల కారణంగా చాలా మంది ప్రమాదాలకు కూడా గురౌతుంటారు. అందుకే.. ఓ వ్యక్తి ఆ గుంతల సమస్యకు పురుషాంగంతో పరిష్కారం చెప్పాడు.
ఇంతకీ మ్యాటరేంటంటే... ఇంగ్లాండ్ లోని మిడిల్స్ బర్గ్ కాలనీలో రోడ్లు గుంతల మయంగా మారిపోయాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో... ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. తన స్ట్రీట్ పెయింటింగ్ టాలెంట్ తో.... గుంతలు పడిన చోట పురుషాంగం బొమ్మలు వేశాడు. చూడటానికి చాలా ఇబ్బంది కరంగా ఉండటంతో.. అధికారులు దిగిరాకతప్పలేదు. వెంటనే గుంతలు కనపడకుండా సరిచేసేసారు.
మేం చేసింది పురుషాంగాల చిత్రాలను చూసి కాదు.. ఇప్పటికే ఈ గుంతలు పూడ్చాలని నిర్ణయించుకున్నామని అధికారులు కవరింగ్ చేసుకుంటున్నారు. గతంలోనూ ఇంగ్లాండ్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఓ వ్యక్తి వేసిన పెయింటింగ్స్ చూసి గతంలో అధికారులు రోడ్లు సరిచేశారని అక్కడివారు చెబుతున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 30, 2019, 4:22 PM IST