మెక్సికోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆపై పుర్రెను పగలగొట్టి.. మెదడును బయటకు తీసి తిన్నాడు. అలాగే ఆమె పుర్రెను యాష్ ట్రేగా వినియోగించాడు. ఈ ఘోరమైన ఘటన ప్యూబ్లోలో జరిగింది.
మెక్సికోలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 32 ఏళ్ల మెక్సికన్ అమానవీయత ఘటనకు పాల్పడ్డాడు. డ్రగ్స్ బానిసైన ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపి.. ఆపై ఆమె పుర్రెను బద్దలు చేసి.. మెదడును బయటకు తీసి తిన్నాడు. అలాగే ఆమె పుర్రెను యాష్ ట్రేగా వినియోగించాడు ఆ నరరూప రాక్షసుడు. ఈ ఘోరమైన ఘటన ప్యూబ్లోలో జరిగింది. ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
స్థానిక వార్తల ద్వారా అందిన సమాచారం ప్రకారం..అల్వారో అనే 32 ఏళ్ల వ్యక్తి బిల్డర్. 38 ఏళ్ల మరియా మోంట్ సెరాట్ ను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. కానీ, మరియా మోంట్ సెరాట్ కు మొదటి వివాహం ద్వారా ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడి వయస్సు 12 ఏళ్లు కాగా..పెద్ద కుమార్తె వయసు 23 ఏళ్లు. కాగా. డ్రగ్స్ కు బానిసైనా అల్వారో జూన్ 29న దారుణానికి ఒడిగట్టాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు తన భార్యను హత్య చేశాడు.
మృతదేహాన్ని ముక్కులుగా నరికేశాడు. హంతకుడు శరీరంలోని కొన్ని భాగాలను కాలువలో పడేసి, మిగిలిన వాటిని ఇంట్లో ఉంచినట్లు సమాచారం. అత్యంత జుగుప్సాకర విషయమేమిటంటే.. ఆమె పుర్రెను పగలకొట్టి.. మెదడును బయటకు తీసి తిన్నాడు. అంతేకాకుండా.. ఆమె పుర్రెను యాష్ ట్రేగా వినియోగించాడు. మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి అల్వారోను అరెస్టు చేశారు. పోలీసుల విచారణ సమయంలో సంచలన విషయాలను వెల్లడించారు. దెయ్యం ఆదేశించడంతో ఈ నేరం చేసినట్లు అతడు పోలీసులకు తెలిపాడు. ఆమెను హత్య చేసిన తర్వాత నిందితులు మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ సంచుల్లో పెట్టినట్టు తెలిపారు.
రెండు రోజుల తర్వాత నిందితుడు తన సవతి కుమార్తెకు ఫోన్ చేసి నేరాన్ని అంగీకరించాడు. తాను చంపిన తల్లిని తీసుకవెళ్లమని తెలిపాడు. బాధితురాలి తల్లి మరియా అలిసియా మోంటియెల్ సెరాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. హంతకుడు తనకు ఫోన్ చేసి.. తన కుతూర్నిచంపి బ్యాగ్‌లో పెట్టాననీ, తన కుమార్తెలలో ఒకరిని వచ్చి తీసుకెళ్లమని చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది.
అల్వారో .. తన భార్య మృతదేహాన్ని కత్తి, ఉలి , సుత్తితో నరికివేసినట్లు పేర్కొన్నాడు. డ్రగ్స్ కు బానిసైన అల్వారో .. తన భార్య కుమార్తెలను కూడా మానిసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపించారు. అతడు మానసిక రోగి కావొచ్చని, అందుకే ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటాడని ఆమె పేర్కొన్నారు.
