ఇదేం చర్మంరా బాబు.. రబ్బర్ సాగినట్లు సాగుతోంది..!
అతని బుగ్గలు పట్టుకుంటే.. ఏకంగా 10 సెంటిమీటర్లు మేర సాగుతుంది. ఇక అతని పొట్ట దగ్గరి చర్మమైతే 15.8 సెంటిమీటర్లు సాగడం గమనార్హం.
మన చర్మం గట్టిగా పట్టుకొని లాగితే ఏమౌతుంది..? కొద్ది దూరం సాగుతుంది.. తర్వాత నొప్పి పుడుతుంది. కానీ.. ఇతనిది మాత్రం.. ఏదో రబ్బర్ పట్టుకొని లాగినట్లు.. లాగినకొద్దీ సాగుతుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇతనికి ఈ విషయంలో గిన్నీస్ బుక్ రికార్డు కూడా దక్కింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గ్యారీ టర్నర్. ఇంగ్లాండ్ కి చెందిన ఈ వ్యక్తి చర్మం.. రబ్బర్ సాగినట్లు సాగుతుంది. అతని బుగ్గలు పట్టుకుంటే.. ఏకంగా 10 సెంటిమీటర్లు మేర సాగుతుంది. ఇక అతని పొట్ట దగ్గరి చర్మమైతే 15.8 సెంటిమీటర్లు సాగడం గమనార్హం.
గ్యారీ చర్మం ఇంతలా సాగటానికి కారణం అతడికున్న ‘‘ఎహ్‌లర్స్ డాన్‌లోస్ సిండ్రోమ్’’ అనే అరుదైన శారీరక లోపమే. తన లోపాన్ని తలుచుకుని అతడెప్పుడూ అధైర్యపడలేదు.
దాన్నే తన ఉపాధిగా మలుచుకున్నాడు. తన చర్మాన్ని రకరకాలుగా సాగిదీస్తూ షోలు చేయటం మొదలుపెట్టాడు. చివరకు గిన్నిస్ వరల్డ్స్ రికార్డ్సులోనూ చోటు సాధించాడు. గ్యారీ మాట్లాడుతూ.. ‘‘ నా చర్మం ప్రత్యేకమైనదని నాకు తెలుసు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నపుడు మా అంకుల్స్ వారి స్నేహితులకు నన్ను చూపించి నవ్వుకునేవారు. నా చర్మాన్ని గట్టిగా సాగదీయటం వల్ల నొప్పేమీ ఉండదు. కానీ, ఈ లోపం వల్ల కలిగే ఇతర ఇబ్బందులు బాధిస్తుంటాయి’’ అని 2012లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.