అమెరికాలో రాకాసి దోమల గుంపు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో పాడి జంతవుల్ని, అటవీ వన్య ప్రాణుల్ని బలి తీసుకుంది.

వివరాల్లోకి వెళితే.. లూసియానా రాష్ట్రంలో గత నెల 27న సంభవించిన హరికేన్ లారా కారణంగా పెద్ద సంఖ్యలో రాకాసి దోమలు వూళ్ల మీద పడుతున్నారు. అక్కడి గేదేలు, ఆవులు, గుర్రాలు, జింకలపై దాడి చేసి వాటిని రక్తాన్ని పీల్చి చంపేశాయి.

ఈ ఘటనలో దాదాపు లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు హెలికాఫ్టర్ల సాయంతో దోమల మందు పిచికారీ చేశారు. దీంతో దోమల ఉద్ధృతి కాస్త తగ్గింది.

ఈ దోమల దాడిలో దాదాపు 400 పాడి జంతువులు, 30 వరకు జింకలు మృత్యువాత పడ్డాయి. సెప్టెంబర్ 2న ఓ వ్యక్తి తీసిన ఫోటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. చనిపోయిన ఎద్దు చుట్టూ చేరిన దోమల గుంపు దాని రక్తం పీల్చేస్తున్నాయి.