పుల్వామా దాడి సూత్రధారి, జైషే మొహ్మద్ అధినేత మసూద్ అజార్ గాడపడ్డట్లుగా తెలుస్తోంది. రావల్పిండి ఆర్మీ ఆసుపత్రిలో భారీ పేలుడు సంభవించిందని.. ఈ ఘటనలో మసూద్ తీవ్రంగా గాయపడ్డట్లుగా పాకిస్తాన్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి.

తీవ్ర అనారోగ్యంతో రావల్పిండి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం జరిగిన పేలుళ్లలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయని నెటిజన్లు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.

పేలుడు ఘటనలో అజార్ గాయపడటంతో ఆయనను ఎమర్జెన్సీ వార్డుకు తరలించినట్లుగా తెలిపారు. అయితే పేలుళ్ల విషయమై పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.