మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బిరెన్‌ సింగ్‌కు‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది‌. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు ఐసోలేషన్‌కు వెళ్లాలని సూచించారు.

‘ఫ్రెండ్స్‌.. నాకు కరోనా పాజిటివ్‌గా తెలింది. కొన్ని రోజులుగా తాను కరోనా లక్షణాలతో బాధపడుతున్నానని ఈ నేపథ్యంలో ఆదివారం కోవిడ్‌ పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌ వచ్చింది.

అందువల్ల ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్‌ పరీక్షలు చేసుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి’ అంటూ ముఖ్యమంత్రి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.

కాగా ఇప్పటి వరకు మణిపూర్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కరోనా మృతి కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 213కు చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ తాజా హల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది.