Asianet News TeluguAsianet News Telugu

500 మందికి తండ్రి వీర్యదానం.. ప్రేయసి వేటలో కొడుక్కి చిక్కులు

తండ్రి చేసిన ఓ పని కొడుకుకి అనవసర తలనొప్పలు తెచ్చిపెట్టింది.  గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుక్కోవడానికే భయపడేలా చేసింది. దీంతో డేటింగ్ యాప్ ట్రై చేయాలంటేనే టెన్షన్ పడిపోతున్నాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. 

Man whose father donated sperm 500 times, is scared of meeting siblings on dating apps - bsb
Author
Hyderabad, First Published Feb 22, 2021, 1:53 PM IST

తండ్రి చేసిన ఓ పని కొడుకుకి అనవసర తలనొప్పలు తెచ్చిపెట్టింది.  గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుక్కోవడానికే భయపడేలా చేసింది. దీంతో డేటింగ్ యాప్ ట్రై చేయాలంటేనే టెన్షన్ పడిపోతున్నాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. 

ఇంతకీ విషయం ఏంటంటే.. యూఎస్ లోని ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన 24 యేళ్ల జేవ్ ఫోర్స్ ది ఓ విచిత్ర సమస్య. జేవ్ కు డేటింగ్ యాప్ అంటే భయం పట్టుకుంది. దీనికి కారణం అతని తండ్రే. ఎలాగంటే.. జేవ్ తండ్రి వయసులో ఉన్నప్పుడు 500 సార్లు తన వీర్యాన్ని దానం చేశాడట. దీంతో వారి రాష్ట్రంలోని అతడి వీర్యంతో సంతానం పొందినవారు అనేకమంది ఉన్నారు.  

వీరంతా జేవ్ కి సమవయస్కేలు. అయితే ఏంటీ అంటారా?.. వాళ్లు వరసకు జేవ్ కి అక్కో, చెల్లో అవుతారు కదా.. అదీ సమస్య. ఇప్పుడు వారు కూడా డేటింగ్ యాప్ వాడుతుండొచ్చు. ఒకవేళ తాను డేటింగ్ యాప్ లో తన తండ్రి వీర్యదానంతో పుట్టిన అమ్మాయిలతో ప్రేమలో పడితే ఎలా అనే భయమే అతన్ని వేధిస్తోంది. 

అలాంటి అమ్మాయిలకు తల్లులు వేరైనా జన్యుపరంగా తండ్రి జేవ్ తండ్రే అవుతాడు కాబట్టి.. జేవ్ కు వారంతా సోదరీమణులే అవుతారు. ఇప్పుడీ సమస్యే జేవ్ ఎవర్నీ ప్రేమించకుండా చేస్తోంది. 

అంతేకాదు జేవ్ ఇప్పటికే ఎనిమిది మంది తోబుట్టువులను గుర్తించాడట. అందులో ఒకరు తను చదువుకున్న స్కూల్ లోనే చదువుకున్నాడట. ఈ మధ్యే ఆ విషయం తెలిసి జేవ్ ఆశ్చర్యపోయాడు. 

అంతేకాదు.. తన తండ్రి వీర్యంతో జన్మించిన ఇద్దరు సోదరులు ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ఉన్న అపార్ట్మెంట్లలో ఉంటున్నారట. ఇలా ఎవరిని కలిసినా తన సోదరులు, సోదరీ మణులు అవుతుండడంతో ఆందోళన చెందుతున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios