Asianet News TeluguAsianet News Telugu

గర్ల్ ఫ్రెండ్ చెప్పిందని గడ్డానికి రంగు వేసుకుంటే..

తన ప్రేయసి కోరిక మేరకు మీసాలు, గడ్డాలకు రంగు వేసుకున్నాడు. చాలా సేపు అలానే ఉంచుకున్నాడు.  అయితే.. ఆ రంగు అతని చర్మానికి పడలేదు.
 

Man suffers huge allergic reaction after trying to dye his beard
Author
hyderabad, First Published Aug 28, 2020, 9:01 AM IST

ప్రస్తుత కాలంలో స్టైలిష్ గా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటారు. అందుకోసం విభిన్న హెయిర్ స్టైల్స్ ట్రై చేయడం.. లేదంటే.. వివిధ రకాల రంగులు వేసుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే.. తన బాయ్ ఫ్రెండ్ కూడా ట్రెండీగా ఉండాలని ఓ యువతి ఆశపడింది. వెంటనే.. ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పేసింది. 

గర్ల్ ఫ్రెండ్ కోరిక కాదు అనలేక వెంటనే.. తన గడ్డానికి , మీసానికి రంగు వేసుకున్నాడు. అయితే.. ఆ తర్వాత తన ముఖమే మారిపోతుందని ఆ వయుకుడు ఊహించలేకపోయాడు. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దక్షిణాఫ్రికాలోని వెంబర్ బిజల్ పార్క్ ప్రాంతానికి చెందిన మార్నో అనే యువకుడు.. తన ప్రేయసి కోరిక మేరకు మీసాలు, గడ్డాలకు రంగు వేసుకున్నాడు. చాలా సేపు అలానే ఉంచుకున్నాడు.  అయితే.. ఆ రంగు అతని చర్మానికి పడలేదు.

దీంతో కెమిక‌ల్ బ‌ర్న్ జ‌రిగింది. ఫ‌లితంగా అతనికి చ‌ర్మంపై ఎంతో మంట‌గా అనిపించింది. ఈ ఎల‌ర్జిక్ రియాక్ష‌న్ కార‌ణంగా అత‌ని ముఖంలోని డై వేసిన భాగ‌మంతా ఎర్ర‌గా మారిపోయింది. ఇంతేకాదు ముఖం, గొంతు, పెదాలు బాగా వాచిపోయాయి. ఈ చ‌ర్మ స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు మార్నో నెల్లాళ్ల‌పాటు  ఔష‌ధాలు వాడాల్సివ‌చ్చింది. కాగా.. తన అనుభవాన్ని మార్నో ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా వైరల్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios