తలలో కత్తి .. పట్టించుకోని జనాలు.. ప్రాణాల కోసం బైక్‌పై పోలీస్‌స్టేషన్‌కు‌

First Published 24, Jul 2018, 1:14 PM IST
Man Rides Bike To Police Station With A Knife In His head
Highlights

చైనాలో దుండగుల దాడి తీవ్రంగా గాయపడి తలలో కత్తి దిగబడిన వ్యక్తిని రోడ్డు మీదున్న జనాలు పట్టించకోలేదు.. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బైక్ మీద పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు ఓ అభాగ్యుడు

రాను రాను మనుషుల్లో మానవత్వంతో చచ్చిపోతుంది అనడానికి ప్రతినిత్యం ఎన్నో ఉదాహరణలు.. తాజాగా చైనాలో దుండగుల దాడి తీవ్రంగా గాయపడి తలలో కత్తి దిగబడిన వ్యక్తిని రోడ్డు మీదున్న జనాలు పట్టించకోలేదు.. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బైక్ మీద పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు ఓ అభాగ్యుడు. చైనాలో క్విన్ అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. దాడిలో కత్తి అతడి శరీరంలో బలంగా దిగబడిపోయింది..

తీవ్ర రక్త స్రావంతో కొట్టుమిట్టాడుతున్న అతన్ని రోడ్డు మీదున్న వారు చూస్తుండి పోయారే తప్ప అతనిని కాపాడేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు.. దీంతో చేసేదేం లేక రక్తస్రావమవుతున్నా.. తలలో కత్తి దిగబడినా భయపడకుండా తన బైక్‌ మీద దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఒంటినిండా రక్తంతో ఉన్న క్వీన్‌ను చూడగానే స్టేషన్ సిబ్బంది కంగారుపడ్డారు.

అయితే వెంటనే తేరుకుని అతడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి.. క్వీన్ ప్రాణాలు కాపాడారు.. వైద్యులు కొద్ది గంటల పాటు శ్రమించి తలలోంచి కత్తిని బయటకు తీశారు. ఇదే చైనాలో గత ఏప్రిల్‌ నెలలో కూడా ఓ మహిళ తలలో కత్తెర గుచ్చుకుపోవడంతో బస్సు నడుపుకుంటూ హాస్పిటల్‌కు వెళ్లిన ఘటన సంచలనం కలిగించింది. 

loader