Asianet News TeluguAsianet News Telugu

మాజీ ప్రియురాలిపై కోపం ... హ్యాండ్ బాగ్ లో మూత్రం పోసి...!

 ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై కోపంతో.. దారుణంగా ప్రవర్తించాడు. మాజీ ప్రియురాలుపై కోపంతో... ఆమె హ్యాండ్ బ్యాగ్ లో మూత్రం పోశాడు. దక్షిణ కొరియాలో చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్తి వివరాలు ఉన్నాయి.

Man ordered to pay ex-girlfriend Rs 90,000 for urinating her Louis Vuitton bag during argument
Author
hyderabad, First Published Aug 19, 2022, 10:52 AM IST

అబ్బాయిలు ప్రేమలో ఉన్నప్పుడు.. తాము ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయడానికి వెనకాడరు. వారి కోసం తమ సర్వస్వం అర్పించేవారు కూడా ఉన్నారు. ప్రేమలో ఉన్న సమయంలో... ఖరీదైన బహుమతులు ఇస్తూ.. మైమరిపిస్తూ ఉంటారు. అయితే.. ఒక్కసారి ఆ ప్రేమ చెడిందో... ఇక అంతే.. తమ మాజీ ప్రేయసి పై పగ పెంచుకుంటారు.

వారి వల్ల తమకు అంత ఖర్చు అయ్యింది.. ఇంత ఖర్చు అయ్యిందని.. విమర్శలు చేసే మాజీ ప్రియులు చాలా మందే ఉన్నారు. అంతెందుకు తమ మాజీ ప్రియురాలిపై దాడి చేసేవారు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై కోపంతో.. దారుణంగా ప్రవర్తించాడు. మాజీ ప్రియురాలుపై కోపంతో... ఆమె హ్యాండ్ బ్యాగ్ లో మూత్రం పోశాడు. దక్షిణ కొరియాలో చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్తి వివరాలు ఉన్నాయి.

దక్షిణ కొరియాలోని సియెల్ ప్రాంతానికి చెందిన 31ఏళ్ల ఓ యువకుడు.. ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు.  ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించడంతో.. కొంతకాలం పాటు వారు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే.. ఇటీవల వారికి చెడింది. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే... బ్రేకప్ చెప్పినా కూడా అతని ఇగో చల్లారలేదు. కోపంతో ఊగిపోయాడు.

ఆమె చూస్తూండగానే.. తన మాజీ ప్రియురాలి ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకొని.. దానిలో మూత్రం పోశాడు. ఆ తర్వాత దానిని కవర్ చేయడానికి అందులో పర్ఫ్యూమ్ కొట్టాడు. అయితే.. ఆమెకు ఆ విషయం తెలియడంతో... ఆమె ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. యువకుడిని విచారించారు. అయితే.. తప్పును అతడు అంగీకరించకపోవడంతో బ్యాగును ల్యాబ్‌కు పంపి టెస్ట్ చేయించారు. ఫలితాల్లో అతడు చేసిన దారుణం బయటపడింది. ఈ ఘటన గత ఏడాది అక్టోబర్‌లో చోటు చేసుకోగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. చేసిన తప్పుకు యువకుడికి 1,150 డాలర్లు (మన కరెన్సీలో రూ.91వేల) జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios