బహుభార్యతత్వం... ఈ మాట రాజ కుటుంబీలు ఎక్కువగా పాటించేవారు. ఎంత మందిని కావాలంటే అంత మందిని పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉండేది.  ఎంతమందిని చేసుకున్నా.. కనీసం ఎవరూ ప్రశ్నించేవారు కాదు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు ఎవరైనా అలా పెళ్లి చేసుకుంటే.. ఎవరూ ఊరుకోరు. 

అయితే.. దుబాయిలో ఇప్పటికీ ఓ వ్యక్తి ఏకంగా 37 పెళ్లిళ్లు చేసుకున్నాడు.  అది కూడా 28మంది భార్యల మధ్యలో వారిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. 

ఈ వివాహ కార్యక్రమంలో అతడి 135 మంది పిల్లలు, 126 మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన 45 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియోను ఐపీఎస్‌ అధికారి రూపిన్‌ శర్మ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

 

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఒక్క పెళ్లాంతోనే వేగలేకపోతున్నాం.. ఇంత మందిని ఎలా భరిస్తున్నావు స్వామీ అంటూ కొందరు కామెంట్స్ పెట్టడం గమనార్హం. అసలు అంతమందిని ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఎలా అంగీకరించారంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.