మాడ్రిడ్: తల్లికి వచ్చే పెన్షన్ కోసం ఏడాది పాటు తల్లి  మృతదేహంతో  ఓ వ్యక్తి గడిపాడు. ఈ ఘటన స్పెయిన్  రాజధాని మాడ్రిడ్‌లో చోటు చేసుకొంది. తల్లి మరణించినా కూడ  ఆ విషయాన్ని దాచేసిన  ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని కారబాంచెల్‌ ప్రాంతంలో గల ఓ అపార్ట్‌మెంట్‌లో ఇంటి నుండి గత కొన్ని వారాలుగా విపరీతమైన స్థానికులు  పోలీసులకు సమాచారమిచ్చారు. దుర్వాసన వెలువడుతున్న ఇంటి తలుపులు పగులగొట్టారు. అయితే ఆ ఇంటిలోని శవపేటికలో  వృద్దురాలి కుళ్లిన మృతదేహన్ని పోలీసులు గుర్తించారు.

ఏడాది కాలంగా ఆ వ్యక్తి తల్లి బయట కన్పించడం లేదని స్థానికులు  చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 92ఏళ్ల ఆ మహిళ ఏడాది కిందటే చనిపోయినట్లు తెలుస్తోంది. తల్లి చనిపోయిందని తెలిసినా ఆమె 62ఏళ్ల కుమారుడు పింఛను కోసం ఆమె అంత్యక్రియలు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆమె బతికే ఉందని చెప్పి ఇన్నాళ్లూ పింఛను తీసుకున్నట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మృతదేహన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.